ఒక్క పనితో ఉచిత విద్యుత్.. ప్రభుత్వం నుంచి ఫ్రీ డబ్బులు.. మీకూ తెలుసా?…

వేసవిలో కరెంట్ బిల్లులు చూసి షాక్ అవుతున్నారా? ఇక టెన్షన్ వద్దు… కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన్ మంత్రి సూర్య ఘర్ యోజనతో మీరు కరెంట్ బిల్లు పూర్తిగా మాఫీ చేసుకోవచ్చు. ఈ స్కీం ద్వారా ప్రభుత్వమే మీ ఇంటిపై సోలార్ ప్యానెల్లు ఫిక్స్ చేస్తోంది. పైగా బాగా సబ్సిడీ కూడా ఇస్తోంది. ఈ స్కీం ద్వారా నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. దాదాపు 5–6 ఏళ్లలో మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. తర్వాత పూర్తిగా ఫ్రీ కరెంట్..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఖాళీ ప్లాట్లపై సోలార్ ప్యానెల్లు కుదిరేనా?

చాలామందికి డౌట్ వచ్చేది ఇదే – ఖాళీగా ఉన్న ప్లాట్లపై సోలార్ ప్యానెల్లు వేయించుకోవచ్చా అని. దీనికి క్లారిటీగా చెప్పాలంటే, PM సూర్య ఘర్ యోజన కింద సబ్సిడీ పొందాలంటే తప్పకుండా మీ ఇంట్లో కరెంట్ కనెక్షన్ ఉండాలి. కరెంట్ లేని ప్లాట్లపై ఈ ప్యానెల్ల కోసం అప్లై చేయలేరు. ఎందుకంటే ఈ స్కీం ఉద్దేశం – ఇప్పటికే కరెంట్ వాడుతున్న ఇళ్లకు సోలార్ ఎనర్జీ ద్వారా బిల్లు తగ్గించడమే.

మీ ప్లాట్ ఖాళీగా ఉందా? ఇలా చేయండి

మీ ప్లాట్ మీద ప్యానెల్లు వేయించాలనుకుంటే, ముందు కరెంట్ కనెక్షన్ తీసుకోవాలి. లేదంటే, మీరు PM సూర్య ఘర్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు నమోదు చేయొచ్చు లేదా 15555 హెల్ప్‌లైన్‌ నంబర్‌ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. ప్రభుత్వం రూల్స్‌ని ఎప్పటికప్పుడు మార్చే అవకాశం ఉంది కాబట్టి, త్వరలో ఖాళీ ప్లాట్లకూ అనుమతి వచ్చే అవకాశం ఉంటుంది.

Related News

సబ్సిడీ వల్ల పెట్టుబడి తక్కువ

ఈ యోజనలో ప్రభుత్వం 1KW నుంచి 3KW వరకు ప్యానెల్లపై సబ్సిడీ ఇస్తోంది. ఉదాహరణకు, మీరు 2KW సిస్టం వేయించుకుంటే దాదాపు రూ.60,000 ఖర్చవుతుంది. కానీ సబ్సిడీతో మీ ఖర్చు రూ.15,000 – రూ.20,000కి తగ్గిపోతుంది. నెలకు రూ.1,500 వరకు కరెంట్ బిల్లులు సేవ్ చేస్తే, 1.5 నుండి 2 ఏళ్లలో మీ పెట్టుబడి తిరిగొస్తుంది. మిగిలిన సంవత్సరాల పాటు ఫ్రీగా కరెంట్ వినియోగించవచ్చు.

ఇప్పుడు అప్లై చేయకపోతే స్కీం మిస్

ఈ స్కీం పూర్తిగా ముందు apply చేసినవారికి మాత్రమే అందుతుంది. అందుకే మీ ఇంటికి ఈ అవకాశాన్ని మిస్ కాకండి. PM Surya Ghar Yojana ద్వారా మీ ఇంటిని ఒక మినీ పవర్ ప్లాంట్‌లా మార్చేసుకోండి. తక్కువ పెట్టుబడి పెట్టి జీవితాంతం కరెంట్ tension లేకుండా ఉండాలంటే ఇప్పుడే అప్లై చేయండి.