రూ.50 సైడ్ పెట్టినా 5 ఏళ్లలో రూ.1 లక్ష… ఈ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే…

మీ స్టోరీ కూడా ఇదేనా? నెలాఖరుకి బ్యాంక్ ఖాతాలో రూ.100 మిగిలితే అదే అదృష్టం అనిపిస్తుందా? సేవ్ చేయాలనుకుంటున్నా, చేయలేకపోతున్నారా? అయితే టెన్షన్ వద్దు. మీ రోజువారీ చిన్న చిన్న అలవాట్లే అసలు సమస్యకి కారణమై ఉండొచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కానీ గుడ్ న్యూస్ ఏంటంటే – ఈ అలవాట్లలో కాస్త మార్పు చేస్తే చాలు, మీరు నెలకు వందలు కాదు, వేలు సేవ్ చేయగలరు. మీరు ఎలాంటి పెట్టుబడీ లేకుండానే సేవింగ్స్ స్టార్ట్ చేయొచ్చు. ఒక్క రోజుకు రూ.50  పెడితే, 5 ఏళ్లలో రూ.1 లక్ష సేవ్ చేయడం ఒక రకమైన సేవింగే.

ప్లాన్ లేకుండా ఖర్చు చేస్తున్నారా?

నియంత్రణ లేకుండా ఖర్చు చేయడం వల్ల ఎంత వస్తే అంత అయిపోతుంది. నెల ప్రారంభంలోనే ఓ బడ్జెట్ సిద్ధం చేసుకోండి. అవసరమైన ఖర్చులు ఏవో, అనవసరమైనవేవో చూసి ఆపై నిర్ణయించండి. చిట్టా పెట్టుకుంటే మీ ఖర్చు ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది.

Related News

సేల్ చూసి వెంటనే కొంటున్నారా?

డిస్కౌంట్లు చూసి అవసరం లేని వస్తువుల్ని కొనేయడం ఆపండి. ఎప్పుడైనా కొనే ముందు ఒకసారి ఆలోచించండి – “ఇది లేకపోతే నిజంగా నాకేం అవుతుంది?” అని. జవాబు ‘ఏం కాదు’ అయితే అది అసలు కొనవద్దు. ఇలా చేయడం వల్ల వేల రూపాయలు మిగులుతాయి.

క్రెడిట్ కార్డుతో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారా?

క్రెడిట్ కార్డు వాడడం ఈజీగా అనిపించినా, అది పెద్ద బరువుగా మారిపోతుంది. ఎక్కువ వడ్డీ, EMI బాకీలతో కష్టాలు వస్తాయి. అందుకే అవసరమైతే తప్ప వాడకండి. డెబిట్ కార్డు లేదా నేరుగా సొంత డబ్బుతోనే చెల్లింపులు చేయండి.

చిన్న ఖర్చులను లైట్ తీసుకుంటున్నారా?

రోజూ కాఫీ, OTT సబ్‌స్క్రిప్షన్లు, ఫ్రీక్వెంట్ ఫుడ్ డెలివరీ – ఇవన్నీ చిల్లరగా అనిపించినా నెలాఖరుకి పెద్ద మొత్తం అవుతాయి. ఇవి కంట్రోల్ చేస్తే నెలకు కనీసం రూ.1500–2000 సేవ్ చేయవచ్చు.

సేవ్ చేస్తే సరికాదు, పెట్టుబడి కూడా పెట్టాలి… మీ డబ్బును FD, SIP, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడి పెడితే – మీ డబ్బు మెల్లగా పెరుగుతుంది. రోజుకి రూ.50 SIP పెట్టినా 5 ఏళ్లకు రూ.1 లక్ష కావచ్చు. అలాగే నిదానంగా మీ డ్రీం ఫైనాన్షియల్ గోల్స్ చేరుకోచ్చు.

ఇక మీ చేతిలో అవకాశమే ఉంది – చిన్న అలవాట్లు మార్చండి, పెద్ద సేవింగ్స్ సాధించండి.