PF అకౌంట్ కి రెండు బ్యాంకు అకౌంట్లు లింక్ చేయొచ్చా?…తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన రూల్స్…

EPF (Employees’ Provident Fund) కేవలం ఒక సేవింగ్స్ స్కీమ్ కాదు, ఇది భవిష్యత్‌లో ఆర్థిక భద్రత ఇస్తుంది. సాధారణంగా ఉద్యోగి జీతం నుండి 12% EPFలో జమ అవుతుంది, అదే మొత్తాన్ని కంపెనీ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది EPFO (Employees’ Provident Fund Organisation) ద్వారా నియంత్రించబడుతుంది.

PF అకౌంట్‌కి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేయొచ్చా?

  • కొన్నిసార్లు PF అకౌంట్‌కి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఇన్ఆక్టివ్ లేదా క్లోజ్ అవుతుంటుంది.
  • అలాంటి సందర్భాల్లో కొత్త బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి.
  • ఒకేసారి ఒకే బ్యాంక్ అకౌంట్ ద్వారా లావాదేవీలు చేయవచ్చు, కానీ అవసరమైతే మరో అకౌంట్ కూడా లింక్ చేయవచ్చు.

PF అకౌంట్‌కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసే విధానం

  1. EPFO ఇన్‌టిగ్రేటెడ్ పోర్టల్ ఓపెన్ చేయండి.
  2. UAN & పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి.
  3. Manage ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  4. KYC సెక్షన్‌లోకి వెళ్లండి.
  5. Bank ఆప్షన్ ఎంచుకుని అకౌంట్ నెంబర్, పేరు, IFSC కోడ్ ఎంటర్ చేయండి.
  6. Submit చేసి అప్డేట్ కోసం వెయిట్ చేయండి.

EPFO కొత్త సిస్టమ్ – బ్యాంక్‌లా మారబోతుందా?

మన్స్‌ఖ్ మందావీయ (Mansukh Mandaviya) ప్రకారం EPFO 3.0 త్వరలో బ్యాంక్‌లా పని చేస్తుందిUAN ద్వారా ఉద్యోగులు తమ PF అకౌంట్స్ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఉద్యోగం లేకపోతే PF ఎలా విత్‌డ్రా చేసుకోవాలి?

  • 1 నెల పాటు నిరుద్యోగిగా ఉన్నారా? మీ PF మొత్తంలో 75% విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • 2 నెలలు ఉద్యోగం లేకపోతే? మిగిలిన 25% కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.

కంపెనీ మూతపడితే PF విత్‌డ్రా చేసుకోవచ్చా?

  • 6 నెలల పాటు కంపెనీ మూతపడితే మీ PF మొత్తాన్ని పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • కంపెనీ తిరిగి ఓపెన్ అయితే తీసుకున్న మొత్తం 36 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో తిరిగి చెల్లించాలి.

లేఆఫ్ అయితే PF ఎలా విత్‌డ్రా చేయాలి?

  • మీరు ఆకస్మికంగా లేఆఫ్ అయితే PF మొత్తం 50% తీసుకోవచ్చు.

ఎవరైనా ఉద్యోగం కోల్పోతే వీటిని తప్పకుండా తెలుసుకోవాలి.

మీ PFలో రూ.50 లక్షలు వరకు ఉంటే, ఉద్యోగం కోల్పోయినా, కంపెనీ మూతపడ్డా, లేదా లేఆఫ్ అయినా – డబ్బు తీసుకునే అవకాశాలు ఉన్నాయి… మీ అకౌంట్ మేనేజ్ చేయడం, విత్‌డ్రా రూల్స్ తప్పకుండా తెలుసుకోవాలి.