Tenth Exams: ఏపీలో ప్రారంభమైన పది పరీక్షలు!!

ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రంజాన్ సెలవులను బట్టి ఈ నెల 31న లేదా ఏప్రిల్ 1న చివరి పరీక్ష జరుగుతుంది. 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

వీరిలో 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు, 30,609 మంది ప్రైవేట్ విద్యార్థులు. ఏపీలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. పరీక్షా కేంద్రాల వద్ద తల్లిదండ్రులతో సందడి నెలకొంది.

Related News