బిజినెస్ పెట్టాలనుకుంటున్న మహిళలకు బిగ్ ఆఫర్…₹10 లక్షల వరకు పథకం.. ఇప్పుడే అప్లై చేయండి…

ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి అనేక పథకాలను అందిస్తోంది. అందులో ఒకటి మహిళా ఉద్యమి యోజన. ఈ పథకం ద్వారా మహిళలు తక్కువ వడ్డీ రేటుతో ₹10 లక్షల వరకు ఋణం తీసుకుని తమ స్వంత వ్యాపారం ప్రారంభించవచ్చు. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మహిళా ఉద్యమి యోజన అంటే ఏమిటి?

  •  స్వంతంగా చిన్న, మధ్య తరహా వ్యాపారం మొదలుపెట్టాలనుకునే మహిళలకు ₹10 లక్షల వరకు లోన్ అందించే పథకం.
  • ఈ పథకాన్ని స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (SIDBI) ద్వారా అందిస్తున్నారు.
  • లోన్‌పై అత్యల్ప వడ్డీ ఉంటుంది.
  • రుణాన్ని 5 నుంచి 10 ఏళ్లలో తిరిగి చెల్లించుకోవచ్చు.

ఎవరెవరు అప్లై చేయవచ్చు?

  1.  వ్యాపారం మహిళల పేరుతో రిజిస్టర్ అయి ఉండాలి.
  2. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే బిజినెస్ ప్రాజెక్ట్ ప్లాన్ రెడీగా ఉండాలి.
  3. వ్యాపారం పార్ట్నర్‌షిప్‌లో ఉంటే, మహిళా వాటా 51% కంటే ఎక్కువ ఉండాలి.
  4. భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన మహిళలు అప్లై చేయవచ్చు.

ఈ స్కీమ్ ప్రత్యేకతలు

  •  కనీస భద్రత (కోలాటరల్) అవసరం లేదు – అంటే ఎటువంటి ప్రాపర్టీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
  • మహిళలు ₹10 లక్షల వరకు రుణం పొందవచ్చు.
  • పెద్ద వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే, మొత్తం ఖర్చు 25% లేదా ₹25 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.
  • రుణాన్ని 10 ఏళ్ల లోపు తిరిగి చెల్లించుకోవచ్చు.

అవసరమైన డాక్యుమెంట్లు

  1.  ఆధార్ కార్డు
  2. PAN కార్డు
  3. బ్యాంక్ స్టేట్‌మెంట్ (కనీసం 9 నెలల)
  4. ITR ఫైల్ చేసిన కాపీ

ఎలా లోన్ పొందాలి?

స్టెప్ 1: మీకు దగ్గరలోని ఏదైనా బ్యాంక్‌కు వెళ్లి మహిళా ఉద్యమి యోజన గురించి వివరాలు తెలుసుకోండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

స్టెప్ 2: మీకు అవసరమైన లోన్ మొత్తం, వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకోండి.

స్టెప్ 3: బ్యాంక్‌లో అప్లికేషన్ ఫారం తీసుకుని, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు సమర్పించండి.

Related News

స్టెప్ 4: బ్యాంక్ నుంచి అప్రూవల్ వచ్చాక, మీ అకౌంట్‌లోకి రుణం జమ అవుతుంది.

బిజినెస్ పెట్టాలనుకునే మహిళలు ఈ సూపర్ స్కీమ్‌ను మిస్ అవ్వొద్దు…ఇప్పుడే బ్యాంక్‌లో వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని అప్లై చేయండి