రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి కొత్త కార్డులు పంపిణీ చేసే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు, పై వారికి ఏపీఎల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే పింక్ కార్డులు ఉన్నవారికి ఆకుపచ్చ రంగు కార్డులు, తెల్ల కార్డులు ఉన్నవారికి మూడు రంగుల కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.