ఇంట్లో ఉంటూనే ఇంటి కల నిజం.. మహిళలకు బంపర్ ఆఫర్లు.. ₹5 లక్షల నుంచి ₹1 కోటి వరకు హోమ్ లోన్…

మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం అందించేందుకు పలు బ్యాంకులు మరియు ఫైనాన్స్ కంపెనీలు ప్రత్యేకమైన లోన్ ఆఫర్లను తీసుకొచ్చాయి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ & SBI ప్రత్యేకమైన లోన్ స్కీమ్స్ ప్రకటించాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

‘Khushi’ హోమ్ లోన్ – మహిళల కోసం ప్రత్యేకమైన స్కీమ్!

ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ ‘Khushi’ అనే ప్రత్యేకమైన హోమ్ లోన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా మహిళలు తక్కువ వడ్డీ రేటుతో ఇంటిని కొనుగోలు చేసే అవకాశం పొందవచ్చు.

  • ₹5 లక్షల నుంచి ₹1 కోటి వరకు లోన్
  • తక్కువ వడ్డీ రేట్లు
  •  100% డిజిటల్ ప్రాసెసింగ్ & డోర్‌స్టెప్ సర్వీస్
  •  ‘Track My Loan’ ఫీచర్‌తో లోన్ ప్రాసెస్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

“మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యమే అసలైన సాధికారత” అని ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ CEO పంకజ్ గడ్గిల్ తెలిపారు.

Related News

SBI ‘Asmita’ – మహిళల కోసం కాలటరల్ ఫ్రీ బిజినెస్ లోన్

SBI మహిళా వ్యాపారస్తులకు ప్రత్యేకంగా ‘Asmita’ పేరుతో కాలటరల్ ఫ్రీ బిజినెస్ లోన్స్ ప్రకటించింది. అంటే, ఇక్కడ లోన్ తీసుకోవడానికి మీకు ఎలాంటి భద్రతను (Collateral) ఇవ్వాల్సిన అవసరం లేదు.

  • తక్కువ వడ్డీ రేటుతో బిజినెస్ లోన్
  • కాలటరల్ అవసరం లేకుండా అందుబాటులో
  •  RuPay ఆధారిత ‘Nari Shakti’ డెబిట్ కార్డు

IDBI, BOI నుంచి మహిళలకు అదనపు డిస్కౌంట్ల!

  • IDBI బ్యాంక్ – హోమ్ లోన్‌పై 0.05% వడ్డీ రేటు తగ్గింపు + ప్రాసెసింగ్ ఫీజు ఫ్రీ! (ఈ ఆఫర్ మార్చి 31, 2025 వరకు మాత్రమే!)
  • Bank of India – స్టార్ పర్సనల్ లోన్‌పై 0.50% వడ్డీ తగ్గింపు

మహిళలకు ఈ స్పెషల్ లోన్ స్కీమ్స్ ఎందుకు బెస్ట్?

  1.  తక్కువ వడ్డీ రేట్లు – రుణ భారాన్ని తగ్గించుకోవచ్చు
  2.  కాలటరల్ ఫ్రీ లోన్స్ – వ్యాపారం ప్రారంభించేందుకు సులభతరం
  3.  ఫాస్ట్ ప్రాసెసింగ్ – డిజిటల్ ఫెసిలిటీస్‌తో వేగంగా అందుబాటులో

ఇంకా ఆలస్యం చేయకండి మీ అవసరానికి తగ్గట్లు ఏ బ్యాంక్ లోన్ బెస్ట్ అనేది వెతికి, త్వరగా అప్లై చేసుకోండి.