AP Assembly: నాలుగో రోజు బడ్జెట్ సమావేశాలు.. ఆ అంశాలపైనే కీలక చర్చ..

బడ్జెట్ సమావేశాల నాల్గవ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నలు, సమాధానాలతో సమావేశాన్ని ప్రారంభిస్తారు. నేటి సమావేశంలో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. శాఖల వారీగా కేటాయించిన నిధులపై చర్చ ఉంటుంది. అదేవిధంగా, రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల సమస్య, భూ వివాదాల సమస్యలు ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అదేవిధంగా.. సంకీర్ణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎక్సైజ్ విధానంపై సభ్యులు మంత్రిని ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా.. రాష్ట్రం నుండి విదేశాలకు వెళ్లి అక్కడ మెడిసిన్ చదివిన విద్యార్థుల సమస్యలపై క్లుప్త చర్చ ఉంటుంది. వైద్య, ఆరోగ్య మంత్రి మంత్రి సత్య కుమార్ ఈ అంశంపై మాట్లాడుతారు. మరోవైపు.. శాసన మండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాల సెషన్‌తో ప్రారంభమవుతాయి.