మీ వద్ద ఉపయోగించని బంగారం ఉందా? అది అలాగే ఉంచితే లాభం లేదు! SBI Revamped Gold Deposit Scheme (R-GDS) లో పెట్టండి, భద్రత కూడా – వడ్డీ ఆదాయం కూడా!
SBI R-GDS అంటే ఏమిటి?
SBI Revamped Gold Deposit Scheme ద్వారా మీరు మీ బంగారం భద్రంగా ఉంచుతూ, వడ్డీ కూడా పొందవచ్చు.
బంగారం ఎలా డిపాజిట్ చేయాలి?
- మీరు బంగారం, ఆభరణాలు లేదా గోల్డ్ కాయిన్స్ డిపాజిట్ చేయాలనుకుంటే, SBI గుర్తించిన బ్రాంచ్‌కి వెళ్లి గోల్డ్ డిపాజిట్ అప్లికేషన్ ఫారమ్, KYC డాక్యుమెంట్లు సమర్పించాలి.
- అప్లికేషన్ ముంబై నోడల్ బ్రాంచ్ లేదా SBI వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఇతర బ్రాంచ్‌లకు సమర్పించాలి.
R-GDS కింద 3 రకాల గోల్డ్ డిపాజిట్ ఆప్షన్లు
- 1-3 సంవత్సరాల డిపాజిట్ – Short-Term Bank Deposit (STBD)
- 5-7 సంవత్సరాల డిపాజిట్ – Medium-Term Government Deposit (MTGD)
- 12-15 సంవత్సరాల డిపాజిట్ – Long-Term Government Deposit (LTGD)
ఎంత వడ్డీ లభిస్తుంది?
- 1-3 ఏళ్లకు – 0.55% – 0.60% వార్షిక వడ్డీ
- 5-7 ఏళ్లకు – 2.25% వార్షిక వడ్డీ
- 12-15 ఏళ్లకు – 2.50% వార్షిక వడ్డీ
MTGD, LTGD లో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది, కానీ వడ్డీ మాత్రం రూపాయల్లో చెల్లిస్తారు.
Related News
మెచ్యూరిటీ తర్వాత బంగారం ఎలా తిరిగి వస్తుంది?
మీరు రెండు ఆప్షన్లు ఎంచుకోవచ్చు
- బంగారం తిరిగి బార్ రూపంలో పొందండి (మీ సర్టిఫికేట్‌లో ఉన్న బరువుకు సమానంగా).
- బంగారం ప్రస్తుత విలువకు సమానమైన నగదు తీసుకోవచ్చు.
ఈ స్కీమ్‌లో పన్ను మినహాయింపు ఉందా?
ఈ స్కీమ్‌పై ఎలాంటి TDS లేదు, అంటే మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు!
ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది?
ఈ స్కీమ్ 2015లో ప్రారంభమైంది Gold Monetisation Scheme లో భాగంగా. 1999లో ఉన్న పాత Gold Deposit Schemeకి బదులుగా దీనిని తీసుకొచ్చారు.
మీ బంగారం నుండి ఆదాయం సంపాదించండి
బ్యాంక్ లాకర్‌లో భద్రత మాత్రమే – కానీ R-GDSలో భద్రత కూడా, వడ్డీ ఆదాయం కూడా. మీరు కూడా మీ ఉపయోగించని బంగారాన్ని డిపాజిట్ చేసి లాభపడండి!