ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 19వ విడత విడుదలకు సిద్ధం!

భారత ప్రభుత్వం ఫిబ్రవరి 24, 2025PM-KISAN యోజన 19వ విడత విడుదల చేయనుంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులు తమ 19వ విడత డేట్ ను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అక్టోబర్ 5, 2024న భారత ప్రధాని PM-KISAN 18వ విడతను ప్రారంభించారు. DBT (Direct Benefit Transfer) ద్వారా ఈ పథకం కింద నమోదైన రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయం జమ అవుతుంది.

PM-KISAN 19వ విడత వివరాలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ రాష్ట్రం, భగల్‌పూర్ లో PM-KISAN 19వ విడతను ప్రారంభించనున్నారు. ఈ విడతలో రైతుల ఖాతాల్లో రూ.2,000 నేరుగా DBT విధానం ద్వారా జమ అవుతుంది. ఇప్పటి వరకు 11 కోట్లు మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం కల్పించింది. మొత్తం రూ. 20,000 కోట్ల వరకు రైతులకు అందజేశారు.

Related News

PM-KISAN పథకానికి అర్హతలు

  • భారత పౌరుడు కావాలి.
  • చిన్న, సన్నకారు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
  • రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు అర్హులు కావు.
  • డాక్టర్, లాయర్, ఇంజినీర్ లేదా CA గా పని చేస్తున్నవారు ఈ పథకానికి అర్హులు కాదు.

ఆర్థిక ప్రయోజనాలు

1. రూ.6,000 సంవత్సరానికి మూడు విడతలుగా (రూ.2,000 చొప్పున) రైతులకు అందుతుంది.

2.DBT పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది.

కావాల్సిన పత్రాలు

  • ఆధార్ కార్డ్
  •  భూమి పత్రాలు
  •  సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వివరాలు
  •  రేషన్ కార్డు / పౌరసత్వ ధృవీకరణ పత్రం
  •  KYC పత్రాలు

PM-KISAN 19వ విడత స్థితి చెక్ చేసే విధానం (PFMS పోర్టల్)

Step 1: PMFS అధికారిక వెబ్‌సైట్కి వెళ్లండి.
Step 2: “Check Your DBT Payment Status” బటన్‌పై క్లిక్ చేయండి.
Step 3: ఆధార్ నంబర్ మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
Step 4: “View Installment” బటన్‌ను క్లిక్ చేస్తే, మీ విడత స్థితి కనబడుతుంది.

సంప్రదించాల్సిన నెంబర్లు

📞 హెల్ప్‌లైన్ నంబర్: 155261 / 011-24300606

(గమనిక: ఈ సమాచారం మారవచ్చు. తాజా వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.)