TCS: జీతాల పెంపుపై టీసీఎస్ ప్రకటన: ఈ సారి ఎంతంటే..

టెక్ పరిశ్రమ కొంతకాలంగా అనిశ్చితిలో ఉంది. పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ సమయంలో భారతదేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (TCS) కొత్త ఉద్యోగులను నియమించుకోవడమే కాకుండా జీతాల పెంపునకు సంబంధించి కీలక ప్రకటన కూడా చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

2024-25 ఆర్థిక సంవత్సరానికి జీతాల పెంపునకు సంబంధించిన లేఖలను మార్చి చివరి నాటికి ఉద్యోగులకు అందిస్తారు. పెరిగిన జీతాలతో ఏప్రిల్ నుండి చెల్లింపులు ప్రారంభమవుతాయి. అయితే, జీతాల పెంపు 4 శాతం మరియు 8 శాతం మధ్య ఉంటుందని అంచనా.

2023-24 ఆర్థిక సంవత్సరంలో జీతాలు 7.9 శాతం అదేవిధంగా 2022-23లో 10.5 శాతం పెరిగాయి. అయితే, ఈసారి ఎంత పెంపుదల అనేది అధికారికంగా వెల్లడించలేదు. అక్టోబర్-డిసెంబర్ కాలానికి ఫిబ్రవరిలో కంపెనీ విడుదల చేసిన త్రైమాసిక వేరియబుల్ పే (QVP) తర్వాత, అర్హత కలిగిన ఉద్యోగులకు ఇది ఇవ్వబడుతుంది. సీనియర్ స్థాయి ఉద్యోగులు 20 శాతం నుండి 40 శాతం తక్కువ చెల్లింపులను అందుకుంటున్నారు.

Related News

TCS కంపెనీలో Y గ్రేడ్ (ట్రైనీ, C1 (సిస్టమ్స్ ఇంజనీర్స్), C2, C3-A&B, C4,C5, CXO) వరకు వివిధ కేటగిరీలలో ఉద్యోగులు ఉన్నారు. C3B, అంతకంటే ఎక్కువ ఉద్యోగులను సీనియర్ కేటగిరీగా పరిగణిస్తారు. ఇటీవల విడుదల చేసిన వేరియబుల్ పేలో 70 శాతం ఉద్యోగులు 100 శాతం అందుకున్నట్లు తెలుస్తోంది. ఇది C3, అంతకంటే తక్కువ స్థాయి వారికి ఎక్కువగా ప్రయోజనం చేకూర్చినట్లు కనిపిస్తోంది.