SBI: SBI వినియోగదారులకు గుడ్ న్యూస్..లోన్ తీసుకోవడానికి ఇదే మంచి టైం..!

SBI (ప్రభుత్వ రంగ బ్యాంకు) తన కస్టమర్లకు గొప్ప వార్తను అందించింది. రెపో రేటును 6.50 శాతం నుండి 6.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజు నుండి దీనిని అమలు చేయనున్నట్లు SBI తెలిపింది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. కొత్త రుణగ్రహీతలకు ఇది మంచి అవకాశం అని చెప్పబడింది. MCLR, BPLR రేట్లలో ఎటువంటి మార్పు లేదని వెల్లడైంది. రెపో రేటును తగ్గించడం బ్యాంకులకు లాభాన్ని ఇవ్వడమే కాకుండా, రుణాలపై వడ్డీని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా.. ఇది కొత్త రుణగ్రహీతలకు గొప్ప అవకాశం అవుతుంది. వడ్డీ రేట్ల తగ్గింపుతో, ఆర్థిక భారం కొంతవరకు తగ్గుతుంది. బహుళ రుణాలు తీసుకోవాలనుకునే వారికి ఇది అద్భుతమైన సమయంగా పరిగణించవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now