మోటో మొబైల్ ప్రియుల కోసం ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దేశంలో ఇటీవల విడుదలైన మోటరోలా G05 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. గత సంవత్సరం లాంచ్ అయిన మోటరోలా G04 ఫోన్‌కు ఈ మొబైల్ వారసుడు. ఈ మొబైల్లో మోటో G04 కంటే పెద్ద డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ కొత్త ధర, స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం.
మోటరోలా G05 మొబైల్ 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే అమ్ముడవుతోంది. ఫోన్‌ను కేవలం రూ. 6,999కే ఆర్డర్ చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ 30 శాతం తగ్గింపు ఇస్తోంది. మీరు కొన్ని బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేసుకుంటే మీకు అదనంగా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫోన్ గ్రీన్, ప్లం రెడ్ రంగులలో లభిస్తుంది.
స్మార్ట్‌ఫోన్ పంచ్ హోల్ స్టైల్ IPS LCD, 6.67-అంగుళాల HD ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 1604 × 720 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు మద్దతు ఇస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో నడుస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆర్మ్ మాలి G52 MC2 GPU ఉంది. ఇది 4GB RAM + 8GB వర్చువల్ RAM, 64GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. మైక్రో SD ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచవచ్చు.
Related News
స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ అందించబడింది. ఇది LED ఫ్లాష్‌తో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. మొబైల్లో 5,200mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. నీరు, ధూళి నుండి రక్షించడానికి ఫోన్ IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ డాల్బీ అట్మోస్, స్టీరియో స్పీకర్లు, 3.5mm ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.4, వై-ఫై, GPS, USB టైప్-C పోర్ట్ కూడా ఉన్నాయి.