Hall Tickets: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. వాట్సాప్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంకీర్ణ ప్రభుత్వం శుభవార్త అందించింది. వాట్సాప్ గవర్నెన్స్ పై పరీక్ష హాల్ టికెట్లను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నుండి విద్యార్థులకు వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. ఫీజు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల హాల్ టికెట్లను నిలిపివేయడం వంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే 161 సేవలు అందించబడుతున్న విషయం తెలిసిందే. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరంలో 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వారికి వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. 10వ తరగతి విద్యార్థులకు కూడా త్వరలో ఇలాంటి అవకాశాన్ని కల్పించాలని విద్యా శాఖ యోచిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలలో CCTV కెమెరాలు ఏర్పాటు చేయబడి ఇంటర్మీడియట్ విద్యా బోర్డు కార్యాలయానికి అనుసంధానించబడుతుంది. ఈ నెల 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

హాల్ టికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Related News

1. మీ ఫోన్‌లో WhatsApp గవర్నెన్స్ AP నంబర్ 9552300009ని సేవ్ చేసుకోండి.
2. సెర్చ్ బాక్స్‌లో ఇంటర్ హాల్ టికెట్ లేదా హాయ్ అని టైప్ చేయండి.
3. మీకు మనమిత్ర WhatsApp గవర్నెన్స్ నుండి సమాధానం వస్తుంది.
4. ఆ సందేశంలో మీరు విద్యా సేవల ఎంపికను ఎంచుకోవాలి.
5. ఆ తర్వాత సెలెక్ట్ హాల్ టికెట్ ఎంపిక వస్తుంది.
6. అందుబాటులో ఉన్న హాల్ టిక్కెట్లు ఆకుపచ్చ చిహ్నంతో కనిపిస్తాయి.
7. మీరు దానిలో అవసరమైన ఎంపికను ఎంచుకోవాలి.
8.మీరు రూల్ నంబర్, మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
9. మీరు మీ హాల్ టికెట్ ప్రదర్శించబడిన వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *