నేటి బిజీ జీవితంలో, రోజువారీ అవసరాల కోసం ఎక్కడికైనా సమయానికి చేరుకోవడానికి ద్విచక్ర వాహనం తప్పనిసరి. ప్రజా రవాణాలో ప్రయాణించడం వల్ల ఆఫీసుకు ఆలస్యం కావచ్చు. అయితే, మీరు క్యాబ్ తీసుకుంటే, ట్రాఫిక్‌లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ప్రతిరోజూ ఆఫీసుకు, ఇతర పనులకు వెళ్లే వారికి గేర్లు మార్చకుండా నడపగలిగే స్కూటర్లు బైక్‌లతో పోలిస్తే ఉత్తమ ఎంపిక. మహిళలు కూడా స్కూటర్లను సులభంగా నడపవచ్చు. అందుకే ఇప్పుడు 125 సిసి విభాగంలో వస్తున్న ఉత్తమ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
హోండా యాక్టివా 125
ఆక్టివా అనేది భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్. యాక్టివా 125 స్కూటీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 94,442 రూ. 97,146 మధ్య ఉంటుంది. దీనికి 123.92 సిసి పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ స్కూటర్ లీటరుకు 47 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఆక్టివా పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ సైరెన్ బ్లూ సహా 6 రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. హోండా ఆక్టివా ఫీచర్ల విషయానికొస్తే.. TFT కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, ఐడిల్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ ఆక్టివా 125 బైక్ బరువు 109 కిలోలు. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5.3 లీటర్లు.
Related News
సుజుకి యాక్సెస్ 125
సుజుకి యాక్సెస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 81,700. దీనికి 125 CC పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ స్కూటర్ లీటరుకు 45 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది. ఈ స్కూటర్ మెటాలిక్ మాట్టే స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రే వైట్, మెటాలిక్ మాట్టే బ్లాక్, సాలిడ్ ఐస్ గ్రీన్, పెర్ల్ షైనీ బీజ్ రంగులలో అందుబాటులో ఉంది. సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ లక్షణాల విషయానికొస్తే.. డిజిటల్-ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఉన్నాయి. భద్రత కోసం ముందు డిస్క్ బ్రేక్‌లు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. దీనికి అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఈ యాక్సెస్ 125 స్కూటర్ బరువు 103 కిలోలు, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5 లీటర్లు.
హీరో జూమ్ 125
ఈ కొత్త స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 86,900. దీనికి 124.6 CC పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది లీటరుకు 45 కి.మీ మైలేజీని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ స్కూటర్ మెటాలిక్ టర్బో బ్లూ, మ్యాట్ స్టార్మ్ గ్రేతో సహా అనేక రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. ఈ కొత్త హీరో జూమ్ స్కూటర్ లక్షణాల విషయానికొస్తే.. ఇది LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, అండర్-సీట్ స్టోరేజ్ లైట్, డిస్క్, డ్రమ్ బ్రేక్‌లు వంటి లక్షణాలను కలిగి ఉంది.