ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో బ్రాండ్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇది భారత మార్కెట్లో కొత్త మోడళ్లను విడుదల చేస్తోంది. శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పుడు మరో కొత్త మొబైల్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. క్రేజీ ఫీచర్లతో కూడిన వివో ఎక్స్ 200 ప్రో మినీ ఫోన్ త్వరలో భారతదేశంలో విడుదల కానుందని చర్చ జరుగుతోంది. ఇంతలో వివో ఎక్స్ 200 సిరీస్‌లో వివో ఎక్స్ 200, వివో ఎక్స్ 200 ప్రో ఇప్పటికే భారతదేశంలో విడుదలయ్యాయి. వివో ఎక్స్ 200 ప్రో మినీ ఏప్రిల్‌లో భారత మార్కెట్లో విడుదల అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. మీరు ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ, కెమెరా కోసం చూస్తున్నట్లయితే, వివో ఎక్స్ 200 ప్రో మినీ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
నివేదికల ప్రకారం.. వివో ఎక్స్ 200 ప్రో మినీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల AMOLED LTPO డిస్ప్లేను కలిగి ఉంది. దీని 1.5K AMOLED LTPO ప్యానెల్ అధిక-రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ వేరియంట్ ఈ సిరీస్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే 9400 చిప్‌ను కలిగి ఉంటుంది. దీనికి 5,700 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం Vivo X200 Pro Mini ట్రిపుల్ 50-మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
50MP ప్రైమరీ కెమెరా (Sony LYT818 సెన్సార్), 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ కెమెరా (100x డిజిటల్ జూమ్), దీనితో పాటు దీనికి 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, NFC, GPS కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అంచనా ధర రూ. 55,000 – రూ. 65,000 ఇది ప్రీమియం విభాగంలో లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫోన్ Samsung Galaxy S24, OnePlus 12 లకు గట్టి పోటీని ఇస్తుంది.