విమాన ప్రయాణం చేయాలని అందరూ కలలు కంటారు. కానీ, ఛార్జీలు వేలల్లో ఉండటంతో సామాన్యులకు అది సాధ్యం కాదు. కానీ, ఇప్పుడు ఒక సువర్ణావకాశం వచ్చింది. మీరు చౌక ధరకు విమాన ప్రయాణం చేయవచ్చు. ఎలా? ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా విమాన టిక్కెట్లపై ఆఫర్‌లను ప్రకటించింది. ఎయిర్ ఇండియా తీసుకువచ్చిన నమస్తే వరల్డ్ సేల్‌లో భాగంగా కేవలం రూ. 1499కే విమాన టిక్కెట్లను అందిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై భారీ తగ్గింపులు ఇస్తున్నట్లు తెలిపింది.
ఈ సేల్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. టికెట్ బుకింగ్‌లు ఫిబ్రవరి 2 నుండి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 6 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్‌లో బుక్ చేసుకున్న వారు ఫిబ్రవరి 12 నుండి అక్టోబర్ 31 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చని చెప్పింది. ఈ ఆఫర్ ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్‌లకు వర్తిస్తుంది. ఈ ఆఫర్‌లో దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ. 1499 నుండి ప్రారంభమవుతాయి. ప్రీమియం ఎకానమీ రూ. 3,749 నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా బిజినెస్ క్లాస్ టికెట్ ధరలు రూ. 9,999 నుండి ప్రారంభమవుతాయి.
అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ. 12,577 నుండి ప్రారంభమవుతుండగా.. ప్రీమియం ఎకానమీ రూ. 16,213 నుండి ప్రారంభమవుతుంది. బిజినెస్ క్లాస్ విమాన టికెట్ ధర రూ. 20,870 నుండి ప్రారంభమవుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.