వెంకటాపురం ఎంపీయూపీ పాఠశాల ఉపాధ్యాయురాలు ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రంగంపేట: వెంకటాపురం MPUP పాఠశాల ఉపాధ్యాయురాలు (స్కూల్ అసిస్టెంట్) డి.సుశీలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ‘విద్యార్థులతో కారు కడిగిన ఉపాధ్యాయురాలు’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే.
దీనిపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పందించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన విచారణకు ఆదేశించారు. ఎంఈఓ కె.శ్రీనివాసరావు, ఎంఈఓ-2 మధుసూధన్ రావు శనివారం పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు.
Related News
కారు శుభ్రం చేయించడం, ఇతర వ్యక్తిగత పనులు చేయించడం వంటి ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాత, జిల్లా పాఠశాల విద్యా అధికారి నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.