1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ చాలా ఒత్తిడిని ఎదుర్కొంది. యుద్ధం ప్రభుత్వ ఖజానాను క్షీణించింది. అదనంగా, దేశం కరువు, ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కొంది. ఈ పరిణామాలు వ్యవసాయ ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. పంటల కొరత కారణంగా.. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది. ఇది శ్రేయస్సును తగ్గించి, భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని తెచ్చిపెట్టింది. ఈ సందర్భంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంతరావు బి. చవాన్ 1973-74 బడ్జెట్ను సమర్పించారు. ఈ బడ్జెట్లో, రూ. 550 కోట్ల ఆర్థిక లోటును ప్రకటించడంతో ఆర్థిక పరిస్థితి మరింత అనిశ్చితంగా మారింది. ఆ సమయంలో, ఈ మొత్తం చాలా పెద్దదిగా చెప్పవచ్చు.
కీలక నిర్ణయాలు
Related News
కరువు కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని చవాన్ తన బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. కరువు కారణంగా.. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందని, ఫలితంగా బడ్జెట్ లోటు పెరిగిందని ఆయన అన్నారు. కరువు, ఆర్థిక లోటు ప్రభావం కారణంగా దేశ ఆర్థిక విధానాలు మరింత క్లిష్టంగా మారాయి. ఈ బడ్జెట్లో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ వంటి కీలక రంగాల జాతీయీకరణకు రూ. 56 కోట్ల కేటాయింపును ప్రకటించారు.
దేశ ఆర్థిక విధానాలపై ప్రభావం..
బొగ్గు గనులను జాతీయం చేయడం ద్వారా దేశంలో ఇంధన రంగం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక విధానాలపై భారీ ప్రభావాన్ని చూపాయి. అందుకే అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దీనిని ‘బ్లాక్ బడ్జెట్’ అని పిలిచారు. ఆ క్రమంలో, ఇది దేశ ఆర్థిక విధానాలు, ప్రణాళికలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఇది తీవ్ర అనిశ్చితి, పెట్టుబడులను కోల్పోయే భయం, వృద్ధి మందగించడం, ప్రజలకు సహాయం అందించే విధానాలలో సముచితత లేకపోవడం వల్ల జరిగింది. దీని వల్ల ప్రభుత్వం ఖర్చులను తగ్గించి ఆర్థిక క్రమశిక్షణను పాటించాల్సి వచ్చింది. ఇది దేశంలో తాత్కాలికంగా పేదరికాన్ని పెంచింది. వినాశకరమైన పరిస్థితిని సృష్టించింది.
2025 కేంద్ర బడ్జెట్ అంచనాలు
ఇప్పుడు 2025 బడ్జెట్ను పరిశీలిస్తే.. అది ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రణాళికలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అనిపిస్తుంది. భారత ప్రభుత్వం 2025 బడ్జెట్ను ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో ఈ బడ్జెట్ను ప్రెవేశపెడుతారు. రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి, కేంద్ర బడ్జెట్ కోసం వివిధ రంగాలు, పరిశ్రమల నుండి ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. చైనా వస్తువులపై పన్ను మినహాయింపులు, సుంకాలు వంటి మరిన్ని అంశాలపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.