మన ఆరోగ్యం మనల్ని తీసుకునే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉండాలంటే తరచుగా కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవాలి. అయితే, మనకు రోజుకో రకం కూరలు తినే అలవాట్లు ఉంటుంది. రుచి కోసం మధ్యాహ్నం ఒక కూర, రాత్రికి ఒక కూర వండుకుంటాము. ఈ క్రమంలో నోటికి రుచిని అందించే బంగాళాదుంపలతో చేసే మెంతాకుల కూర గురించి చూద్దాం. ఈ కూరను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తినవచ్చు. మెంతుల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మలబద్ధకం, జీర్ణ క్రియను సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇప్పుడు బంగాళా దుంప కూర ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
1. మెంతాకులు – నాలుగు కప్పులు
2. బంగాళదుంపలు – రెండు
3. జిలకర్ర – ఒక స్పూను
4. కారం – ఒక స్పూను
5. ఎండుమిర్చి – రెండు
6. పసుపు – అర స్పూను
7. కొత్తిమీర తరుగు – ఒక స్పూను
8. జీలకర్ర పొడి – ఒక స్పూను
9. నూనె – రెండు స్పూన్లు
10.ఉప్పు రుచికి తగినంత
11. ఇంగువ – చిటికెడు
12. అల్లం తరుగు – ఒక స్పూను
13. వెల్లుల్లి తరుగు – ఒక స్పూను
14.ధనియా పొడి – ఒక స్పూను
Related News
తయారు చేసుకునే విధానం
1. మెంతాకులను శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. తరువాత చిన్న బంగాళా దుంపలను బాగా ఉడికించి పైన తొక్క తీసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి
3. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. అందులో మెంతాకులు, కొద్దిగా ఉప్పు వేసి వేయించి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే పాన్ లో మరొక స్పూన్ నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఇంగువ వేసి కాసేపు వేయించాలి.
5. తర్వాత ఇందులో తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వేసి 30 సెకండ్ల పాటు వేయించాలి.
6. తరువాత వీటిలో పసుపు, బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
7. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మెంతి ఆకులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
8. ఇప్పుడు మూత పెట్టేసి ఉన్న ఫ్లేమ్ మీద అరగంట పాటు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి గరిటతో కలుపుతూ ఉండాలి.
9. మెంతాకులు చేదు పోయేవరకు ఉంచి పొడి పొడిగా వచ్చేలా ఉడికించుకోవాలి. నీళ్లు వేయకుండానే దీన్ని వండుకోవాలి. ఇది దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి, ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. అంతే బంగాళదుంప మెంతికూర రెసిపీ రెడీ.