మహారాష్ట్ర, ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు మరియు ఖాళీలు
Related News
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్): 130
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్): 65
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇనుస్ట్రుమెంటేషన్): 37
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కెమికల్): 2
మొత్తం ఖాళీల సంఖ్య: 234
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.30,000-రూ.1,20,000.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-02-2025