ఈ స్మార్ట్ ఫోన్స్ పై 10 వేల తగ్గింపు.. కొనడానికి ఈరోజే లాస్ట్ డేట్!

ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం మాన్యుమెంటల్ సేల్‌ను ప్రారంభించింది. అనేక ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై గొప్ప తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్‌లో iPhone 16, iPhone 13, Moto G85, OnePlus 12 వంటి స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లు ఉన్నాయి. అయితే, ఈ అమ్మకం జనవరి 19 తో ముగుస్తుంది. ఆ తరువాత ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఎలాంటి ఫోన్ల పై ఆఫర్లు ఉన్నాయో చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 16 సిరీస్‌పై రూ.12,000 వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. ఐఫోన్ 16 ప్లాట్‌ఫామ్‌లో రూ.69,999కి లభిస్తుంది. అయితే, దీని ప్రారంభ ధర రూ. 79,999, అంటే మొత్తం రూ. 9,900 తగ్గింపు ఇస్తోంది. ఇదే సమయంలో ఐఫోన్ 16 ప్లస్ అసలు ధర రూ.89,900 కాగా, రూ.79,999కి కొనుగోలు చేయొచ్చు. అంటే.. ఇది కూడా రూ. 9,900 తగ్గింపుతో లభిస్తుంది. ఇక iPhone 16 Pro గురించి మాట్లాడుకుంటే.. ఈ ఫోన్‌ను రూ.1,12,900కి కొనుగోలు చేయవచ్చు. అంటే.. ఈ ఫోన్‌పై రూ.7,000 ప్రత్యక్ష తగ్గింపు లభిస్తోంది. మరోవైపు.. ఐఫోన్ 16 ప్రో మాక్స్ గురించి మాట్లాడుకుంటే.. దాని ధర లాంచ్ ధర రూ. 1,44,900 నుండి రూ. 1,37,900 కి తగ్గింది. ఐఫోన్ 13 కూడా రూ. 43,499 తగ్గింపు ధరకు అమ్మకానికి ఉంది.

ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Samsung Galaxy S24 ఎల్లో మోడల్‌ను రూ. 57,398 కు పొందొచ్చు.ఇదే సమయంలో గెలాక్సీ S24+ కూడా ను రూ. 59,999 కు కొనుగోలు చేయవచ్చు. మెరుగైన బ్యాటరీ లైఫ్, పనితీరు కోసం ప్లస్ మోడల్‌ను కొనుగోలు చేయొచ్చు. ఇక OnePlus 12 స్మార్ట్ ఫోన్ 256GB స్టోరేజ్ మోడల్ గురించి మాట్లాడుకుంటే.. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.55,889కి జాబితా చేయబడింది.

Related News

మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల డిస్కౌంట్ చూస్తే iQOO Neo 9 Pro రూ.35,780కి లభిస్తుంది. మోటరోలా మోటో ఎడ్జ్ 50 ప్రో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో రూ.27,999 ధరకు జాబితా చేయబడింది. ఈ డీల్ క్రీమ్, బ్లాక్ కలర్ మోడళ్లపై మాత్రమే అందుబాటులో ఉంది. Moto G85 ను రూ. 16,999 తగ్గింపు ధరకు కూడా కొనుగోలు చేయవచ్చు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *