జియో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సంస్థ అని చెప్పడంలో ఎంలాంటి సందేహం లేదు. ఇందులో ఉన్న కోట్లాది మంది వినియోగదారులకు వివిధ ధరలకు అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది జియో. ప్రస్తుతం జియో వినియోగదారుల సంఖ్య 44.8 కోట్లు. ఒకవేళ మీరు కూడా రిలయన్స్ జియో యూజర్ అయితే ఈ వార్త మీ కోసమే! ఈరోజు మనం జియో చౌక, సరసమైన రీఛార్జ్ ప్లాన్ గురించి చూద్దాం. దీనిలో మీరు అతి తక్కువ ధరకు అపరిమిత కాలింగ్, డేటా సౌకర్యాన్ని పొందుతారు.
జియో బెస్ట్ కాలింగ్ ప్లాన్
Related News
జియో పోర్ట్‌ఫోలియోలో వివిధ ధరల శ్రేణులలో అనేక రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి డేటా, కాలింగ్‌తో సహా వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.ఈ ప్లాన్ కేవలం రూ. 189 ఖరీదు మాత్రమే. కానీ అది చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తోంది. దీనిలో వినియోగదారులు మొత్తం చెల్లుబాటు సమయంలో అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా మీకు కావలసినంత కాలం కాల్స్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు.. ఈ ప్లాన్‌లో మీరు మొత్తం చెల్లుబాటు కాలంలో మొత్తం 300 SMSలను పంపే సౌకర్యాన్ని కూడా పొందొచ్చు.
అదనపు ప్రయోజనాలు
అయితే, ఎక్కువ డేటాను కావాలంటే ఈ ప్లాన్ సరైనది కాదు. ఎందుకంటే ఇది 2GB హై-స్పీడ్ డేటాను మాత్రమే అందిస్తుంది. ఈ డేటా అయిపోయిన తర్వాత, అదనపు డేటా కోసం ఒక చిన్న యాడ్-ఆన్ ప్యాక్‌ను కొనుగోలు చేయాలి. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. అంటే.. ఈ ప్లాన్‌తో మీ ఫోన్‌లో ఉచిత టీవీ చూడవచ్చు. ఈ ప్లాన్‌ను MyJio యాప్ లేదా Jio అధికారిక వెబ్‌సైట్, Google Pay, Phone Pe వంటి ఆన్‌లైన్ చెల్లింపు యాప్‌ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.