సీజన్స్ మారుతుంటే అర్యోగం పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా.. శీతాకాలంలో అనేక వ్యాధులు దాడి చేస్తాయి. అందువల్ల, మీరు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సీజన్లో చల్లని గాలులు నేరుగా శరీరంపై వాలుతాయి. దీంతో మన శరీరానికి మంచిది కాదు. చల్లని వాతావరణంలో అజాగ్రత్త కారణంగా అనేక సమస్యలు వస్తాయి. అందులో భాగంగా అనేక వ్యాధులు వస్తాయి. ఇప్పుడు శీతాకాలంలో ఏ వ్యాధులు ఎక్కువగా వస్తాయో? వాటి లక్షణాలు ఏమిటి? వాటిని ఎలా నివారించాలి? అనే వివిధ అంశాలకు జవాబులు ఇక్కడ తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులు
Related News
చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్య రావడం సర్వసాధారణం. ముఖ్యంగా.. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికీ ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు బలహీనత, కీళ్లలో దృఢత్వం, కీళ్ళు పగుళ్లు, చేతులు, మెడ, భుజాలు, మోకాళ్లు లేదా ఏదైనా ఇతర కీళ్ల భాగంలో తీవ్రమైన నొప్పి మొదలైనవి. అయితే దీన్ని సులభంగా నివారించడానికి ఎండలో క్రుచోవాలి. లేదా ఆలివ్ నూనెతో మసాజ్ చేసుకోవాలి.
చర్మ సమస్యలు
చలికాలంలో చర్మ సంబంధిత కామన్ గా వస్తాయి. ముఖ్యంగా.. శరీరం బహిరంగ భాగాలలో అధికంగా వస్తాయి. ఈ సమస్య అక్కడ మరింత సమస్యాత్మకంగా మారుతుంది. దీని నివారించేందుకు చల్లటి గాలికి దూరంగా ఉండాలి. చాలా వేడి నీటితో స్నానం చేయకూడదు. చర్మంపై మంచి క్రీమ్, బాడీ లోషన్ లాంటివి అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.
జ్వరం
ఈ సీజన్‌లో జ్వరం సాధారణంగా ఉంటుంది. చలి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీరు వెచ్చని బట్టలు ధరించాలి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, గ్లౌజులతో పాటు వెచ్చని దుస్తులను ధరించాలి. తినడానికి ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. తాజా ఆహారాన్ని తినాలి.
న్యుమోనియా
న్యుమోనియాకు ప్రధాన కారణం జలుబు. ఇది ఏ వయస్సులోనైనా జరగవచ్చు. అయితే, ఇది పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. సరైన సమయంలో చికిత్స అందకపోతే మనిషి ప్రాణం కూడా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లతో పాటు జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి.
చెవి ఇన్ఫెక్షన్
జలుబు పెరిగే కొద్దీ చెవి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. చలికాలంలో చాలా మందికి చెవుల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది. అదనంగా చెవులలో దురద, నిరోధించబడిన భావన కలుగుతుంది. దీని కారణంగా వినికిడిలో ఇబ్బంది ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, వీలైనంత వరకు చెవులను కప్పి ఉంచడం చాలా ముఖ్యం.లేదా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.