7వ వేతన సంఘం అమలులోకి వచ్చి దాదాపు 10 ఏళ్లు గడుస్తున్నా 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఉద్యోగుల నుంచి భారీ డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపినట్లు సమాచారం.
2025 కొత్త సంవత్సరం సందర్భంగా 8వ వేతన సంఘం ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి.
2025లో ఈ కమిషన్ ఏర్పడితే 2026 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.ఉద్యోగుల నుంచి ఊహించని డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం ఈ 8వ వేతన సంఘం ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజ్యసభలో 8వ వేతన సంఘం అంశంపై కేంద్రమంత్రులు చర్చించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇందులో వాస్తవం లేదని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది.
Related News
నిరాధారమైన వార్తలు వచ్చినా.. మొన్నటి రాజ్యసభ చర్చల దృష్ట్యా ఉద్యోగుల ఆశలు ఏమాత్రం తగ్గలేదు. త్వరలో 8వ వేతన సంఘం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. త్వరలో సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ 2025-26లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కమిషన్ను ప్రకటించే అవకాశం ఉందని అధికారిక సమాచారం.
ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ప్రయోజనం పొందే అవకాశం ఉంది. జీతాలు 186 శాతం వరకు పెరగవచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. సాధారణ ఉద్యోగి బేసిక్ వేతనం 18 వేలు ఉంటే.. కొన్ని పే కమీషన్ల ప్రకారం దాదాపు 34,560 వరకు పెరగనుంది. పెన్షన్ కూడా 17,280కి పెరిగే అవకాశం ఉంది.
అయితే ఈమేరకు ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించినట్లు సమాచారం. ఈ కమిషన్ను 2025లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటే 2026లో ఉద్యోగుల జీతాలు, పింఛన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.