Eye Care: ఇవి చేస్తే… మీ పిల్లల కళ్ళు భద్రం… భవిత బంగారం..

సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అవును నిజమే…మన శరీరంలోని అన్ని అవయవాల్లో కళ్ళు ఎంతో ప్రముఖ ప్రాత్ర పోషిస్తాయి. ఇప్పుడు చాలా మంది డిజిటల్‌ గాడ్జెట్స్‌… అంటే ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లకు అలవాటు పడ్డారు. దీంతో వయసుతో సంబంధం లేకుండా…కంటి చూపును కోల్పోతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

గతంతో పోలిస్తే… 100లో 70 శాతం మంది ఎదో ఒక కంటి సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాల్లో తేలింది. చిన్న చిన్న పిల్లలకే కళ్ళజోడు లేనిదే…కంటి చూపు ఆనడం లేదు. అంతలా కళ్ళను మనంతట మనమే పాడు చేసుకుంటున్నాము.

గంటలు గంటలు టీవీలు, కంప్యూటర్లు, ఫోన్లు వాడటం వల్ల కళ్ళు మనకు తెలియకుండానే మసకబారుతాయి. కళ్ళలో దురద, నీరు రావడం, డ్రై ఐ సిండ్రోమ్‌, కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇవి పెద్దలు పాటిస్తూ…పిల్లలకు కూడా నేర్పితే…వారి కంటి చూపును కాపాడినవారవుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Related News

1) గ్యాప్‌ తీసుకోవాలి

మీరు కంప్యూటర్‌పై పని చేస్తే…మధ్యలో గ్యాప్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. కనీసం గంటకొకసారైనా…కంప్యూటర్ స్క్రీన్‌పై నుంచి దృష్టి మరల్చి…పక్కకు చూడటం చెయ్యాలి. మీ టెబుల్‌కు దగ్గరలో అందమైన వాల్‌ పేపర్‌గానీ, మీకు నచ్చే ఫోటో కానీ పెట్టుకుని కొన్ని క్షణాలు చూస్తూ ఉండాలి. ఆ గ్యాప్‌లో దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. మన తీసుకునే శ్వాస ప్రభావం కూడా కళ్ళను రిలాక్స్‌ చేస్తుంది.

2) కళ్ళు ఆర్పాలి

పని మధ్యలో కళ్ళను తరచూ ఆర్పుతూ ఉండాలి. ఇది మీ కళ్ళు డ్రై కాకుండా కాపాడుతుంది. కళ్ళలోని తేమ ఆరిపోకుండా ఉండేలా కాపాడుతుంది. కళ్ళకు డ్రై ఐ సిండ్రోమ్‌ రాకుండా ఉండాలంటే…కళ్ళు ఆర్పడమనేది మంచి టెక్నిక్‌గా పని చేసుంది.

3) కంటి వ్యాయామం

ఏ వయసు వారైనా చేసే కంటి వ్యాయామం దీర్ఘకాలంలో మీ కళ్ళను నిజంగానే కంటికి రెప్పలా కాపాడుతుందని చెప్పడంలో సందేహం లేదు.
ముందుగా మీ వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోవాలి. కళ్ళకు సమాంతరంగా…సరైన ఎత్తులో ఎదైన ఒక వస్తువు ఉంచుకోవాలి.

లేదంటే అక్కడున్న వస్తువునే టార్గెట్‌గా ఊహించుకోవాలి. కళ్ళను సూటిగా… ఎదురుగా ఉన్న వస్తువును చూడాలి. ఆ తర్వాత కళ్ళను పైకి లేపాలి. వీలైనంత పైకి లేపి…ఒక ఐదు సెకన్లు అలాగే ఉంచాలి. తర్వాత కళ్ళు యథా స్థానంలోకి తెచ్చి…ఇప్పుడు ఎడమవైపు చూడాలి…ఇలా ఒక ఐదు సెకన్ల ఉంచాలి. తర్వాత యథాస్థానంలోకి తెచ్చి…ఒక్కసారి కళ్ళు మూసుకొని తెరవాలి.

మళ్ళీ కళ్ళను కుడివైపు కూడా అలాగే చెయ్యాలి. తర్వాత కింది వైపు కూడా చూడాలి. ఈ మొత్తం ప్రక్రియలో మెడను కదల్చకూడదు. ఎటు వైపు కూడా తిప్పకూడదు.

4) చక్రాల్లా తిప్పండి

ఇది కూడా కంటి వ్యాయామం కిందకే వస్తుంది. అయితే…కళ్ళను చక్రాల్లా తిప్పేటప్పుడు…మొదట్లో స్లోగా తిప్పాలి. ఆ తర్వాత సవ్య…అపసవ్య దిశల్లో తిప్పుతూ ఉండాలి. ఇలా కుదిరినప్పుడల్లా చేస్తుంటే…కంటి నరాలకు రక్త సరఫరా బాగా జరిగి…కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
టీచర్లు కూడా…విద్యార్థులతో అప్పుడప్పుడు సరదాగా ఈ కంటి వ్యాయామాలు చేయిస్తే…వారి కళ్ళను కాపాడిన వారు అవుతారు.

5)అర చేతులతో కళ్ళను రుద్దండి

కళ్ళను రుద్దండి…అంటే ఎలా పడితే అలా రుద్దకండి. అలా రుద్దితే…కంటి ఆరోగ్యం మాట దేవుడెరుగు…కంటి చూపు పోయే అవకాశమే ఎక్కువ. ముందుగా మీ రెండు అరచేతులను గట్టిగా రుద్దుకోవాలి. అప్పుడు చేతుల్లో వేడి పుడుతుంది. అప్పుడు అర చేతులతో మీ కళ్ళపై కొన్ని క్షణాల పాటు అలాగే కప్పి…మెళ్ళగా రుద్దండి. ఇలా రుద్దేటప్పుడు…మీ చేతులు ముక్కువైపు నుంచి చెవులవైపు వచ్చేలా ఉండాలి. కానీ వ్యతిరేకంగా రుద్దకూడదు. ఈ చర్యతో కళ్ళు సేద తీరడమే కాదు. చురుగ్గా మారుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది.

వీటితో పాటు…కళ్ళను తరచుగా చల్లటి నీటితో కడుగుతూ ఉంటే…కళ్ళకు అలసట తగ్గుతుంది. కంటి చూపు బాగుండాలంటే…మనం తినే ఆహారం కూడా ముఖ్యమే. విటమిన్‌ ఏ, సీ, జింక్‌, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారం తీసుకుంటే…కంటి ఆరోగ్యం బాగుంటుంది. ఆకుకూరలు, పళ్ళు, క్యారెట్లు ఎక్కువగా తీసుకోవాలి.

ఇలా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటూ…మీ పిల్లలకు కూడా అలవాటు చేస్తే కంటి చూపును కాపడుకోవచ్చు. కళ్ళలో ఏమైనా పడ్డప్పుడు…మరీ ఇబ్బందిగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించడం మరిచిపోవద్దు.

కళ్లు ఆర్పడం..

ల్యాప్టాప్, మొబైల్, టీవి, కంప్యూటర్ ఇలా ఏదైనా సరే.. స్క్రీన్ వైపు తదేకంగా చూడకూడదు. అప్పుడప్పుడు కనురెప్పలు ఆర్పుతూ ఉండాలి. కనీసం 2 సెకెన్ల పాటూ కళ్లు మూసుకుని ఆ తరువాత తెరవాలి. 5 సెకెన్ల పాటూ కనురెప్పలు మూయడం, తీయడం వేగంగా చేయాలి. ఇలా కనీసం రోజులో 5 నుండి 7 సార్లు చేస్తుంటే కంటి అలసట తొలగిపోయి కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

వృత్తాకారం

కళ్లను వృత్తాకారంగా సవ్య దిశలోనూ, అపసవ్య దిశలోనూ తిప్పడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. రోజుకు రెండుసార్లు ఈ వ్యాయామం చేయకూడదు.

కళ్లను కడగాలి..

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కళ్ల మీద కాస్త గట్టిగా నీటిని చల్లుకోవాలి. రోజులో కనీసం 15 నుండి 20 సార్లు ఇలా నీటిని చల్లుకుంటే మంచిది. సూర్యదయానికంటే ముందు ఇలా చేయడం వల్ల చాలామేలు జరుగుతుంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *