కల్కి .. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో కల్కి ఫీవర్ నడుస్తుంది . రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి సక్సెస్ అందుకున్నాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ తన నటనతో టాలీవుడ్ రేంజ్ ని ప్రపంచం మొత్తం పెంచేశాడు.
ఇప్పుడు కల్కి సినిమాతో తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ కనిపించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితా బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించి అదరగొట్టాడు. ఇక కమల్ హాసన్ ఈ సినిమాలో సుప్రీమ్ యాష్కిన్ గా పవర్ ఫుల్ నెగటివ్ రోల్ పోషించారు. దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా ఆకట్టుకున్నారు.
ఇక ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. కోటి రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా. మొదటి రోజు 191 కోట్లు, మూడు రోజుల కలెక్షన్లతో మరింత దూసుకుపోతుంది. ప్రస్తుతం వెయ్యి కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. కాగా, మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గుడిలో తల దాచుకున్నట్లుగా ఉన్న అమితాబ్ ని చూపించారు. కల్కి అవతారం పుట్టిన సమయంలో అశ్వద్ధుడు ఆలయం నుండి బయటకు వస్తాడని చూపించారు. అయితే ఆ గుడి నిజంగా ఉందనే విషయం చాలా మందికి తెలియదు.
అదెక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నెల్లూరు జిల్లాలో. అదే నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులోని చేజర్లలోని నాగేశ్వర స్వామి దేవాలయం. దీన్ని అశ్వద్ధామ దాక్కున్న దేవాలయంగా సినిమాలో చూపించారు. కాకపోతే ఈ ఆలయాన్ని కాశీలో లాగా సృష్టించారు. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున కనుగొనబడింది. 2020లో ఇసుక తవ్వకాల్లో ఈ ఆలయం కనుగొనబడింది.. పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించాడు. గత వరదల సమయంలో ఈ ఆలయం ఇసుకలో మునిగిపోయింది. ఇప్పుడు ఈ ఆలయం సినిమాలో చూపించినందువల్లే ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.