ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణులైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. ఈ మంచి జీతంతో కూడిన ఉద్యోగాలను పొందడం ద్వారా జీవితంలో స్థిరపడవచ్చు. తాజాగా, Staff Selection Commission Multi-Tasking Staff మరియు హవల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8,326 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 4887 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, 3439 హవల్దార్ పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MTS పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. హవల్ధార్ పోస్టులకు వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే రూ. 18000 నుండి రూ. 22000 అందించబడుతుంది. దరఖాస్తు రుసుము రూ. 100 చెల్లించాలి.
మొత్తం పోస్ట్లు: 8,326
Related News
శాఖల వారీగా ఖాళీలు:
- MTS: 4,887
- హవల్దార్: 3,439
అర్హత: Multi-Tasking Staff and Havaldar పోస్టులకు పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట భౌతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
వయస్సు: MTS పోస్టులకు అభ్యర్థులు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. హవల్ధార్ పోస్టులకు వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, documentation verification, physical efficiency test, physical standard test ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైతే రూ. 18000 నుండి రూ. 22000 అందించబడుతుంది.దరఖాస్తు రుసుము: General, OBC, EWS candidates రూ. 100 చెల్లించాలి. SC, ST, PWD, మాజీ సైనికులు మరియు మహిళలకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: Online
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 27-06-2024
దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2024