Ram Charan: వేల్స్ వర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. వీడియో మీకోసం

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన చెర్రీ ఇప్పుడు డా.రామ్ చరణ్. తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ శనివారం (ఏప్రిల్ 13) రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. విద్యార్థుల మధ్య కోలాహలంగా జరిగిన కార్యక్రమంలో రామ్ చరణ్ యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ ప్రతినిధుల చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. దీంతో రామ్ చరణ్ డాక్టర్ రామ్ చరణ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవి, నాగబాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు చరణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కాగా, రామ్‌చరణ్‌ తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. . ఒక తండ్రిగా తనను ఎమోషనల్‌గా, గర్వించే ఎగ్జైటింగ్ మూమెంట్ ఇదని మెగాస్టార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు తమ విజయాలను అధిగమిస్తేనే నిజమైన ఆనందం.

రామ్ చరణ్ వేల్స్ యూనివర్శిటీ ప్రతినిధుల నుండి డాక్టరేట్ అందుకున్న వీడియో ఇక్కడ ఉంది.

Related News