పోలింగ్ ముగిసింది.. EVM లలో రాష్ట్ర భవిష్యత్తు నిక్షిప్తం అయి ఉంది.. జూన్ 4 న రాష్ట్ర కొత్త సీఎం ఎవరో తేలనుంది. ఈ లోపు రాష్ట్ర వ్యాప్తం గా గెలుపు మీద ఏ పార్టీ వారు తమ తమ ధీమా ను వ్యక్తపరుస్తున్నారు.. అదే సమయం లో ఒకింత భయం కూడా ఇరు వర్గాల్లో కనిపిస్తుంది అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెపుతన్నారు..
ఏదేమైనా అనూహ్యం గా పెరిగిన వోట్ శాతం వల్ల ఇరు వర్గాల్లో ఆందోళన అయితే స్పష్టం గా కనిపిస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల పోలింగ్ జరిగింది. సోమవారం రాత్రి చాల సేపటి వరకు కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుండటంతో పలు ప్రాంతాల్లోని నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో మాదే అధికారం అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అలాగే అధికార వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు.
Related News
ఆంధ్రప్రదేశ్ లో ఒకే విడతలో, ఒకే రోజు 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు, 25 లోక్ సభ నియోజక వర్గాలక పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో గతంలో కంటేప్రస్తుతం పోలింగ్ లో ఎక్కువ శాతం మంది ఓట్లు వెయ్యడంతో ఎన్నికల అధికారులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో కంటే ఎక్కువ ఆసక్తి చూపించడంతో ఇటు రాజకీయ నాయకులు హ్యాపీగానే ఉన్నారని తెలిసింది.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 25 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎవరు గెలుస్తారు ? అంటూ బెట్టంగ్ లు మొదలైనాయి. పలు పోలింగ్ కేంద్రాల దగ్గరే గుట్టుచప్పుడు కాకుండా ఎన్నికల బెట్టింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, నాయకులే బెట్టింగ్ లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా టీడీపీ, వైసీపీ, జనసేన, కార్యకర్తలు జోరుగా బెట్టింగ్ లు పాల్పడ్డారని తెలిసింది.
ఏదేమైనా ఈ సారి రాష్ట్ర ఎన్నికల సరళి ప్రకారం గా .. ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేచి చూడటమే..