నవోదయలో ఆరు, తొమ్మిదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి
Navodaya Vidyalayas (JNV ) ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 649 పాఠశాలల్లో సీట్ల భర్తీకి గతేడాది June to August 25 వరకు Online లో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. జనవరి 20న ఆరో తరగతి, February 10న తొమ్మిదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. తాజాగా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఆయా తరగతులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యనందిస్తారు. విద్యార్థులు తమ roll number మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా JNVST ఫలితం 2024 పొందవచ్చు