ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించనుంది. National Pension Scheme (NPS)లో భాగంగా ఉద్యోగుల మూలవేతనంలో 50% పెన్షన్గా అందించాలని ప్రతిపాదించారు.
NPS మరియు అనేక రాష్ట్రాలు పాత పెన్షన్ వ్యవస్థకు తిరిగి రావడంపై అభ్యంతరాల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం 2023లో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. NPS ను మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధానాలను ఈ కమిటీ అధ్యయనం చేసింది.
ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం ఉద్యోగులకు చివరి మూల వేతనంలో 50% పెన్షన్గా ఇవ్వాలని ప్రతిపాదించింది.
సోమనాథన్ కమిటీ కూడా NPS లో మార్పులను సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, కమిటీ తన సిఫార్సులను అమలు చేయడానికి నిర్దిష్ట గడువును విధించలేదు.