బంపర్ ఆఫర్..ఈ శాంసంగ్ ప్రీమియం ఫోన్ పై 40 వేల డిస్కౌంట్!

ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ జరుగుతోంది. దీనిలో చాలా ఫోన్‌లు చాలా చౌక ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో Samsung ప్రీమియం ఫోన్ రూ.40 వేల వరకు చౌకగా లభిస్తుంది. అయితే, కంపెనీ గత సంవత్సరం గెలాక్సీ S24 సిరీస్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం చాలా చౌక ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లోని Galaxy S24+ 5G పై Flipkart నేరుగా రూ. 40,000 తగ్గింపును అందిస్తోంది. మీరు చాలా కాలంగా ప్రీమియం ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఈ డీల్‌ మీకు సరైనది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

డిస్కౌంట్ ఆఫర్

కంపెనీ ఈ ఫోన్‌ను రూ.99,999కి మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ప్లాట్ డిస్కౌంట్ తర్వాత గెలాక్సీ S24 సిరీస్ కింద S24+ 5G కేవలం రూ.59,999కి కొనుగోలుకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే ప్రస్తుతం ఈ పరికరంపై రూ. 40,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇది మాత్రమే కాదు.. నెలకు కేవలం రూ. 6,667 చెల్లించి మీరు ఈ పరికరాన్ని మీ సొంతం చేసుకునేందుకు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు iPhone 13 ఎక్స్ఛేంజ్‌పై రూ. 24,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువను కూడా పొందవచ్చు.

Related News

స్పెసిఫికేషన్లు

Samsung Galaxy S24+ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 2600 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఈ పరికరం Android 14 ఆధారంగా OneUI 6.1 పై నడుస్తుంది. విడుదలైన తర్వాత OneUI 7 కి అప్‌డేట్ చేయవచ్చు. దీనితో పాటు.. Galaxy S24+ లో Galaxy AI ఫీచర్లను కూడా పొందొచ్చు.కెమెరా గురుంచి మాట్లాడుకుంటే.. ఈ పరికరం 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే.. ఈ ఫోన్‌లో 4,900mAh బ్యాటరీ ఉంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *