కొన్ని YouTube ఛానెల్‌లు మరిన్ని వ్యూస్ పొందడానికి తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్ మరియు హెడ్డింగులు ఉపయోగిస్తున్నాయి
అసలు వీడియోకి టైటిల్‌కి సంబంధం లేదు. ఉదాహరణకు, వారు థంబ్‌నెయిల్‌లో ఒక చిత్రం చూపుతారు మరియు లోపల వేరే మేటర్ ఉంచుతారు . సెలబ్రిటీలు, రాజకీయ నేతల గురించి తమ ఇష్టానుసారంగా థంబ్‌నెయిల్స్‌ను రూపొందిస్తున్నారు. లోతుగా వెళితే… ఇలాంటి తప్పుదోవ పట్టించే చర్యలతో వినియోగదారులు చికాకు పడుతున్నారు. దీని వల్ల సమయం వృథా కావడమే కాకుండా యూట్యూబ్ ప్లాట్ ఫాంపై నమ్మకం కూడా తగ్గుతోంది. దీంతో యూట్యూబ్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
బ్రేకింగ్ న్యూస్ మరియు తాజా వార్తల విషయంలో ఇటువంటి క్లిక్‌బైట్ టైటిల్స్ మరియు థంబ్‌నెయిల్‌ల వాడకం పెరిగింది. దీంతో కనీసం వాటికి అడ్డుకట్ట వేయాలని వీడియో స్ట్రీమింగ్ వేదిక నిర్ణయించింది.
ఇలాంటి తప్పుదోవ పట్టించే వీడియోలు అప్‌లోడ్ చేస్తే రానున్న రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇందులో భాగంగా త్వరలో కొత్త నిబంధనలను ప్రవేశపెడతామని తెలిపింది. వీటిని పాటించేందుకు క్రియేటర్లకు తగిన సమయం ఇస్తామని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని వారి వీడియోలను ముందుగా తొలగిస్తామని తెలిపింది. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే ఛానెల్‌పై బాన్ విధిస్తామని చెప్పారు. ముఖ్యంగా భారత్‌లో ఇలాంటి తప్పుదారి పట్టించే వీడియోలు పెరుగుతున్న తరుణంలో ఈ చర్యలు తీసుకున్నట్లు యూట్యూబ్ తెలిపింది.