ప్రభుత్వ ఉద్యోగులకు 7వ పే కమిషన్ ప్రకారం ప్రధానంగా బేసిక్ పెన్షన్ (Basic Pension) + డియర్నెస్ రిలీఫ్ (DR) ఆధారంగా మొత్తం పెన్షన్ లెక్కించబడుతుంది. DR శాతం పెరిగేకొద్దీ మొత్తం పెన్షన్ కూడా పెరుగుతుంది.
ఇప్పుడు ప్రస్తుత DR రేటు 53% ఉండగా, మీ పెన్షన్ మొత్తం ఎంత ఉంటుందో చూద్దాం. చిన్న ఉద్యోగమైనా, తక్కువ జీతమైన మీరు పొందే పెన్షన్ ఎక్కువగా ఉంటుంది తరచూ పెరుగుతూ ఉంటుంది అది ఎలాగో చూద్దాం.
పెన్షన్ ఎలా లెక్కిస్తారు?
- పెన్షన్ అంటే కేవలం బేసిక్ పెన్షన్ మాత్రమే కాదు, దానికి డియర్నెస్ రిలీఫ్ (DR) కూడా జత చేస్తారు.
- ప్రస్తుతం DR రేటు 53% ఉంది.
- ఈ DR రేటును ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి సవరిస్తుంది.
- కొత్త పే కమిషన్ వచ్చినప్పుడు DR బేసిక్ పెన్షన్‌లో కలిపి కొత్త బేసిక్ పెన్షన్‌గా మారుస్తారు.
ప్రస్తుత DR రేటు (53%)తో మొత్తం పెన్షన్ లెక్కలు:
- రూ.20,000 బేసిక్ పెన్షన్ – మొత్తం పెన్షన్ రూ.30,600
- రూ.35,000 బేసిక్ పెన్షన్ – మొత్తం పెన్షన్ రూ.53,850
- రూ.50,000 బేసిక్ పెన్షన్ – మొత్తం పెన్షన్ రూ.76,500
- రూ.65,000 బేసిక్ పెన్షన్ – మొత్తం పెన్షన్ రూ.99,450
- రూ.80,000 బేసిక్ పెన్షన్ – మొత్తం పెన్షన్ రూ.1,24,000
పెన్షన్ లెక్కలు ఎందుకు తెలుసుకోవాలి?
- ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండటానికి ఇది చాలా అవసరం.
- ఇప్పుడు NPS, OPS, మరియు 2025 ఏప్రిల్ 1 నుండి UPS కూడా అందుబాటులో ఉండనుంది.
- పాత పెన్షన్ స్కీమ్ (OPS) ఉన్నవారికి 10 నెలల సగటు జీతం ఆధారంగా పెన్షన్ లెక్కించబడుతుంది.
మరింత పెన్షన్ పొందాలంటే?
- DR శాతం పెరుగుతుండటంతో, భవిష్యత్తులో పెన్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది.
- ఇంకా ఎక్కువ పెన్షన్ పొందాలంటే, ఎక్కువ బేసిక్ పే గల ఉద్యోగాలు చేయడం ఉత్తమం.
- పెన్షన్ మాత్రమే కాకుండా, మరికొన్ని పొదుపు మార్గాలు కూడా అన్వేషించాలి.
ఇలాంటి గుడ్ న్యూస్ మిస్ అవ్వకూడదు. మీ పెన్షన్ ఎంత వస్తుందో ఇప్పుడే లెక్కించుకోండి.