గత కొన్ని సంవత్సరాల్లో మహిళలు పెట్టుబడుల్లో విపరీతమైన అభివృద్ధిని చూపించారు. 2024లో SIP పెట్టుబడుల్లో పురుషులను 22% అధిగమించారు. అంతేకాదు, 2025 ఆర్థిక సంవత్సరానికి క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల్లో 10 రెట్లు పెరుగుదల కనిపించింది.
అంతేగాక, మహిళల పెట్టుబడి అలవాట్లు క్రమశిక్షణతో కూడినవి. SIP ల ద్వారా పెట్టుబడి పెట్టే మహిళల శాతం 90% ఉంటుండగా, లంప్ సమ్ పెట్టుబడుల్లో పురుషుల కంటే 45% ఎక్కువ పెట్టుబడి చేస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే, మహిళలు రాబోయే రోజుల్లో మరింత ఆర్థికంగా స్వతంత్రం అవుతారని స్పష్టంగా అర్థమవుతోంది.
Related News
రిటైర్మెంట్ కోసం ₹1 కోటి ఎలా కూడబెట్టాలి?
పెట్టుబడుల్లో క్రమశిక్షణ అత్యవసరం. “ఖర్చులు = ఆదాయం – పొదుపు” అనే భావనను అలవర్చుకోవాలి.
ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన అంశాలు:
1. ఎక్కువ సమయం పెట్టుబడికి ఇచ్చేలా ప్లాన్ చేసుకోండి:
- రిటైర్మెంట్ అనేది దీర్ఘకాలిక లక్ష్యం.
- కనీసం 2-3 ఉత్తమ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకొని, లాంగ్-టర్మ్ SIP పెట్టుబడిగా పెట్టాలి.
2. SIP కొనసాగించడం ముఖ్యం:
- చిన్నమొత్తంతో మొదలు పెట్టినా సరే, క్రమశిక్షణ తప్పక పాటించాలి.
- మార్కెట్ పడిపోయినా SIP ఆపకండి, లాంగ్ టర్మ్‌లో అది మంచి రాబడిని ఇస్తుంది.
3. లార్జ్ క్యాప్, ఫ్లెక్సి క్యాప్, మల్టీ-ఆసెట్ ఫండ్స్ కలిపి పెట్టుబడి పెట్టండి:
- ఇవి మార్కెట్ హెచ్చుతగ్గులను సమర్థంగా ఎదుర్కొని మంచి రాబడులు ఇస్తాయి.
4. ప్రతి నెల పొదుపు తప్పనిసరి:
- కుటుంబ ఖర్చులు, ప్రయాణాలు, ఫంక్షన్లు ఉన్నా పెట్టుబడిని నిర్లక్ష్యం చేయకూడదు.
5. లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే బంపర్ రిటర్న్స్:
- 25 ఏళ్ల వయస్సులో రూ. 10,000 SIP పెట్టుబడి ప్రారంభిస్తే, 60 ఏళ్లకు ₹1 కోటి పైగా ఫండ్ పొందవచ్చు.
మహిళల ఆర్థిక స్వాతంత్ర్యానికి ఇదే సరైన సమయం
ఇకనుండి మహిళలు పెట్టుబడిలో వెనకపడటం లేదు, వారు లీడర్స్‌గా మారుతున్నారు. ప్రతి మహిళా పెట్టుబడి చేయడం ప్రారంభించి, భవిష్యత్తును సురక్షితంగా మార్చుకోవాలి. మీరూ లేట్ చెయ్యకుండా ఇప్పుడే మొదలు పెట్టండి.
Disclaimer: ఇది విద్యాపరమైన సమాచారం మాత్రమే. పెట్టుబడి నిర్ణయానికి ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి.