ఒక్క యూట్యూబ్ ఐడియాతో లక్షాధిపతిగా మారిన లల్టీ దేవి.. మీరు కూడా ట్రై చేయండి…

కేవలం ఒక యూట్యూబ్ వీడియో చూసి తన జీవితాన్ని మార్చుకున్న లల్టీ దేవి కథ ప్రతి మహిళకూ స్ఫూర్తిదాయకం. బీహార్‌లోని ఛాప్రా గ్రామానికి చెందిన లల్టీ దేవి ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉండేది. భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండటంతో ఇంటి ఖర్చులు తీరడం కూడా కష్టంగా మారింది. పిల్లల చదువుకు డబ్బు లేకపోవడంతో ఆమెకు ఏదైనా చేయాల్సిందేననే భావన కలిగింది.

యూట్యూబ్‌లో చూసిన ఒక ఐడియా జీవితం మార్చేసింది

ఒకరోజు ఫోన్‌లో యూట్యూబ్ చూస్తూ ఓ బిజినెస్ ఐడియా కనుగొంది. అలా జీవికా అనే సంస్థ ద్వారా ₹50,000 రుణం తీసుకుని మష్రూమ్ వ్యవసాయం ప్రారంభించింది. మష్రూమ్ పండించడం మాత్రమే కాకుండా, మష్రూమ్ పికిల్స్, పాపడ్లు, పొడి వంటి ఉత్పత్తులు తయారు చేయడం నేర్చుకుంది. ఇప్పుడు ఆమె తయారుచేసే ఉత్పత్తులు బీహార్‌లోనే కాదు, జార్ఖండ్‌లోని బొకారో వరకు చేరుకుంటున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఒక్క సీజన్‌కే ₹2 లక్షల ఆదాయం

తన విజయ ప్రయాణాన్ని వివరించిన లల్టీ దేవి, భర్త ఆదాయంతో ఇంటి ఖర్చులు తీరలేదని, ఆ పరిస్థితిని ఎలా గెలిచిందో చెప్పింది. జీవికా ద్వారా రుణం తీసుకుని, మష్రూమ్ ప్రొడక్షన్ ప్రారంభించడంతో ఇప్పుడు ఒక్క సీజన్‌కే ₹2 లక్షల వరకు సంపాదిస్తోంది. ఇప్పుడామె కథను చూసి మరెంతో మంది మహిళలు ఈ బిజినెస్ మొదలు పెడుతున్నారు.

మహిళలకు స్వయం ఉపాధి – మారుతున్న జీవనశైలి

ఇప్పుడామె విజయాన్ని చూసి పది మందికిపైగా మహిళలు ఈ రంగంలోకి వచ్చారు. సోనేపూర్ జాతర, పాట్నాలో జరిగే బజార్లలో స్టాళ్లు పెట్టి తమ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. జీవికా సంస్థ ఉచితంగా ట్రైనింగ్, రుణ సదుపాయాలు అందిస్తూ, మరిన్ని మహిళలకు ఆదాయ మార్గాన్ని చూపిస్తోంది.

Related News

మీరు కూడా ట్రై చేయండి – చిన్న పెట్టుబడితో పెద్ద లాభం

లల్టీ దేవి తక్కువ పెట్టుబడితో లక్షాధిపతిగా మారింది. మీరు కూడా ఇంట్లోనే చిన్న పెట్టుబడితో ప్రారంభించి, స్వయం ఉపాధి పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీ బిజినెస్ స్టార్ట్ చేయండి.