రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ పాఠశాలల రేషనలైజేషన్ కోసం తీసుకొచ్చిన జీవో 21 వలన అనేక పాఠశాలలు మూతపడేందుకు ఆస్కారం ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా 30 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడిని కేటాయిస్తానడం సరికాదని వాపోతున్నారు. ఏకోపాధ్యాయు డితో బోధించడం వల్ల రాష్ట్రంలోని సుమారు 5,058 ఫౌండే షన్ స్కూళ్లు, 20,025 బేసిక్ ప్రైమరీ పాఠశాలలు మూతపడ తాయని ఆవేదన చెందుతున్నారు. 20 మంది విద్యార్థులకు ఒ క టీచర్ చొప్పున కేటాయించాలని ఉపాధ్యా యులు, సంఘాల నాయకులు గతంలో కోరినప్పటికీ అందు కు అధికారులు అంగీకరించలేదని.. ఈ విషయంలో కొత్తగా విడుదల చేసిన జీవోలో కూడా టీచర్లు, సంఘాల రిక్వెస్టులు, సూచనలు పట్టించుకోలేదని పలువురు మండిపడుతున్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీవోలో 30 మంది విద్యా ర్థుల వరకు ఒకే ఉపాధ్యాయుడిని కేటాయిస్తామని పేర్కొ న్నారు. ఇక 30 మంది లోపు ఉండే పాఠశాలలను ఫౌండేషన్ స్కూళ్లుగా పరిగణించి ఇక్కడ 1, 2 తరగతులు మాత్రమే కొనసాగిస్తారు. వా స్తవానికి ఫౌండేషన్ స్కూళ్లు 5,058 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఎక్కడా 30 మంది విద్యార్ధులు లేరు. యావరేజ్ 20 నుంచి 25 మంది “లోపు పిల్లలు మాత్రమే అక్కడ చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 20 మందికి ఒక టీచర్ చొప్పున ఇద్దరిని కేటాయిస్తే.. బోధన బాగుంటుందని కోరుతున్నారు.
Related News
ఏకోపాధ్యాయుడితో పాఠశాలలను నడిపితే.. విద్యార్థుల తల్లిదండ్రులు సమీపం లో ఉన్న మోడల్ ప్రైమరీలో నలుగురు ఉపాధ్యాయులు ఉండటం వల్ల వారి పిల్లలను అక్కడికి పంపుతారని తద్వారా ఫౌండేషన్ బడులు మూతపడతా మని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఇక రాష్ట్రంలో బేసిక్ ప్రాథమిక పాఠశాలలు 20,025 ఉన్నాయి. మొత్తం 45 మంది విద్యార్ధులకు ఇక్కడ 1 నుంచి 5 వరకు తరగతులు ఉంటాయి. అయితే.. ఈ పాఠశాలలకు కేవలం ఇద్దరు టీచర్లనే కేటాయిస్తామని జీవోలో పేర్కొన్నారు. దీని వల్ల కూడా అధిక సంఖ్యలో ఉన్న మోడల్ ప్రైమరీ పాఠశాలలకే పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడతారని, దీంతోపాటు ఉపాధ్యాయులపై భారం పెరిగి… పాఠశాలలను సక్రమంగా నిర్వర్తించలేరని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే పంచాయతీలో ఫౌండేషన్, బేసిక్ పాఠశాలతోపాటు, మోడల్ ప్రైమరీ ఉంటే.. మోడల్ ప్రైమరీలు బలోపేతం అవుతామని, ఫౌండేషన్, బేసిక్ బడులు మూతపడతామని టీచర్లు చెబుతున్నారు.
మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లాలి..
గత ప్రభుత్వం ఉపాధ్యాయులపై పనిభారం మోపిందన్న విమర్శల నేపథ్యంలో.. కూటమి సర్కార్ సైతం అదే పంథాలో వెళుతున్నారని పలు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గతానికి ఇప్పటికీ పెద్దగా తేడా లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆరు రకాల పాఠశాలలు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్యను తొమ్మిదికి పెంచారని వాపోతు న్నారు. దీంతోపాటు పనిభా రం పెరిగిందని అంటున్నారు.
ఇప్పటికే వరకు ఉపాధ్యాయ సంఘాల సమావేశాల్లో కేవలం అధి కారులు మాత్రమే పాల్గొన్నారని. ఒకసారి తమ సమస్యలు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని నాయకులు కోరుతున్నారు. తమ సమ స్యలను, సూచనలు, రిక్వెస్టులు ఎన్నిసార్లు అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని కనీసం మంత్రికి తమ ఇబ్బందులు, సమ స్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.