మనిషులు చరిత్రలో ఏళ్ల తరబడి బంగారాన్ని నమ్మకమైన కరెన్సీగా ఉపయోగించారు. దాని వెనుక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి – పౌరుష్యం, నిలకడ, అరుదైనదనం. పాత రోజుల్లో రాజులు బంగారాన్ని నాణేలుగా మింట్ చేసి, వాటిపై తమ ముద్ర వేస్తూ అధికారాన్ని ప్రకటించేవారు.
అయితే, బంగారం నుండి పేపర్ మనీకి మార్పు ఎలా జరిగిందంటే?
పేపర్ మనీ ఎలా వచ్చిందంటే?
బంగారం విలువైనదే కానీ, పోర్టబుల్ కాదు, చిన్న మొత్తాల్లో పంచుకోవడం కష్టం, లావాదేవీల కోసం కష్టతరమైనది. పెద్ద మొత్తాల్లో బంగారం చేతిలో ఉంచుకుని తిరగడం సురక్షితమైనది కాదు.
దీని పరిష్కారంగా బంగారం భద్రపరచే “బ్యాంకర్లు” & “గోల్డ్‌స్మిత్”లు బంగారం డిపాజిట్ చేసేవారు. వారు బంగారం విలువకు సమానమైన సర్టిఫికేట్లు (IOUs) ఇస్తూ, వాటిని ప్రజలు లావాదేవీలకు ఉపయోగించేవారు. ఇది చాలా వీలైన మార్గంగా మారింది.
Related News
మరి తర్వాత ఏం జరిగింది?
ఇది నడుస్తూ ఉండగా, కొంతమంది బ్యాంకర్లు ఎక్కువ కాగితాల(పేపర్ మనీ)ను జారీ చేయడం మొదలుపెట్టారు, అసలు వాళ్ళ దగ్గర అంత బంగారం లేకపోయినా, వారు ఎక్కువ కాలితాలను జారీ చేసేవారు.
కానీ, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు “బ్యాంక్ రన్స్” జరిగేవి – అంటే, ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బంగారాన్ని వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించేవారు. కానీ బ్యాంకర్ల వద్ద అంత బంగారం లేకపోవడంతో చాలా బ్యాంకులు కుప్పకూలిపోయాయి.
ఇక్కడే ప్రభుత్వాలు రంగప్రవేశం చేశాయి
సెంట్రల్ బ్యాంకులను స్థాపించి, డబ్బును ప్రింట్ చేసే అధికారం పూర్తిగా ప్రభుత్వాల చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుండి, ప్రభుత్వ డబ్బును తప్ప మరేదీ చెల్లదు, పన్నులు కూడా ఆ డబ్బుతోనే చెల్లించాలి అని నిబంధనలు తెచ్చారు.
ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం, అధికారాన్ని నిలబెట్టుకోవడం. అందుకే మూడు ప్రధాన విషయాలను నియంత్రించడం ఎంతో ముఖ్యం –
1. ఇన్ఫర్మేషన్ (సమాచారం)
2. మనీ (డబ్బు)
3. వెపన్స్ (ఆయుధాలు)
ఇంటర్నెట్ వల్ల ప్రభుత్వాల నియంత్రణ కుదేలైంది
ఒకప్పుడు ప్రభుత్వాలే మీడియాను పూర్తిగా నియంత్రించేవి. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా వార్తలు మలచి అందించేవి.
- 30 ఏళ్ళ క్రితం ఇండియాలో జరిగిన స్పై స్కాండల్ – మీడియా తప్పుగా ప్రచారం చేసి, చాలా మంది జీవితాలను నాశనం చేసింది.
- న్యూయార్క్ టైమ్స్ “వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్” రిపోర్ట్ ఆధారంగా అమెరికా ఇరాక్ మీద యుద్ధం ప్రకటించింది. ఫలితం? మిలియన్ల మరణాలు, ట్రిలియన్ల అప్పు
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వాల మీద, వాటి బ్యాంకింగ్ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతున్నారు.
ఫియట్ కరెన్సీ – అసలు ఇది ఎందుకు డేంజరస్?
ప్రారంభంలో డాలర్ బంగారం ద్వారా బ్యాక్ చేయబడింది (Gold-Backed Currency). కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు పేపర్ మనీని అర్థంలేని విధంగా ప్రింట్ చేయడం మొదలుపెట్టాయి.
ప్రభుత్వాలకు డబ్బు కావాలి:
1. పన్నులు పెంచితే ప్రజల రెబెల్ అవుతారు.
2. ఎక్కువ డబ్బు ప్రింట్ చేస్తే, రహస్యంగా ప్రజల జేబుల్లో ఉన్న డబ్బు విలువ తగ్గిపోతుంది.
దీని ఫలితమే – ఇన్ఫ్లేషన్ (ధరల పెరుగుదల), పేదలు ఇంకా పేదలు, సంపన్నులు ఇంకా సంపన్నులు అవ్వడానికి కారణం.
ప్రభుత్వాలు ఎలా ప్రజల డబ్బును స్వాధీనం చేసుకున్నాయి?
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో, అమెరికా రష్యా డాలర్ అసెట్లు ఫ్రీజ్ చేసింది. ఇది చాలా దేశాలకు డాలర్ మీద డౌట్ తెచ్చింది
- డీమోనిటైజేషన్ (500, 1000 నోట్ల రద్దు) – ఒక్కరోజులో ప్రజలు రోడ్డున పడ్డారు.
- 1933లో అమెరికాలోనే గోల్డ్ కన్‌ఫిస్కేషన్ – ప్రజల బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ప్రభుత్వాల చేతిలో డబ్బు అంటే ఎప్పుడైనా నిబంధనలు మారతాయి. డిజిటల్ కరెన్సీ భవిష్యత్తా? బిట్‌కాయిన్ ఎంటర్ అయ్యిందా?
బిట్‌కాయిన్ జన్మించిన రెండు ప్రధాన కారణాలు:
1. ఇది డిసెంట్రలైజ్డ్ – ఒక ప్రభుత్వానికీ దీనిపై నియంత్రణ లేదు
2. ఎవరూ అడ్డుకోలేరు – ఇంటర్నెట్ ఉంటే చాలు, లావాదేవీలు చేయవచ్చు
ఇది ఇంటర్నెట్ మాదిరిగానే ఎవరికీ ఆపడం సాధ్యం కాని సాంకేతిక అద్భుతం.
- ఎవరైనా ప్రింట్ చేయలేరు.
- ఎవరూ లావాదేవీలను బ్లాక్ చేయలేరు.
- బ్యాంకుల అవసరం లేదు, మధ్యవర్తుల అవసరం లేదు
ముద్రిత డబ్బు గోల్డ్ ని రీప్లేస్ చేసింది, ఇప్పుడు డిజిటల్ కరెన్సీ పేపర్ మనీని రీప్లేస్ చేస్తుందా? ప్రభుత్వాల నియంత్రణ తగ్గుతున్న కొద్దీ, ప్రజలు డిసెంట్రలైజ్డ్ కరెన్సీ వైపు మళ్లుతున్నారు. మీరు కూడా ఈ కొత్త మార్పులో భాగం అవుతారా? లేక పాత వ్యవస్థకే పరిమితమవుతారా?