Indian Army: టెరిటోరియల్ ఆర్మీ లోకి సచిన్, ధోనీ?… భారత్ సీక్రెట్ ప్లాన్ ఏంటి?…

పాకిస్తాన్‌తో సైనిక ఉద్రిక్తతల తీవ్రత పెరిగిన నేపథ్యంలో భారత సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. టెరిటోరియల్ ఆర్మీని ఆక్టివేట్ చేయడానికి అనుమతులు మంజూరు చేసింది. ఈ ఆర్మీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన కూడా విడుదల చేసింది. ఇప్పటికే టెరిటోరియల్ ఆర్మీలో భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ, షూటర్ అభినవ్ బింద్రా, కేంద్ర మాజీ మంత్రులు అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నటుడు నానా పటేకర్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరితో పాటు, ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీలో చేరాలనే క్రేజ్ ప్రజల్లో పెరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏమిటి?

మన దేశంలో ఆర్మీ, వాయుసేన, నౌకాదళం ఉన్నాయి. వీటితో పాటు, క్లిష్ట సమయంలో యుద్ధభూమిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండే మరో సైన్యం కూడా ఉంటుంది, అదే టెరిటోరియల్ ఆర్మీ. కొన్ని కారణాల వల్ల, సైన్యంలో చేరలేని వారికి దేశానికి సేవ చేయడానికి ఈ ఆర్మీ అవకాశాన్ని అందిస్తుంది. మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, టెరిటోరియల్ ఆర్మీలో చేరవచ్చు. యువత భాగస్వామ్యంగా, పార్ట్‌టైమ్ ప్రాతిపదికన టెరిటోరియల్ ఆర్మీలో చేరి కొంతకాలం దేశ సేవ చేయవచ్చు. ఈ ఆర్మీ, దేశ పౌరులకు సైన్యంలో చేరే గొప్ప అవకాశం కల్పించడమే లక్ష్యం.

ధోనీ, సచిన్, కపిల్ యుద్ధానికి వెళ్తారా?

టెరిటోరియల్ ఆర్మీలో మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ దిగ్గజాలు ఉన్నారు. ఈ సమయంలో యుద్ధ వాతావరణం ఉన్నందున వారిని కూడా పోరాటం కోసం బార్డర్‌కు పిలుస్తారా? అనే చర్చలు జరుగుతున్నాయి. టెరిటోరియల్ ఆర్మీలో ధోనీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. ఆయన ఇతర సైనికులతో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.

Related News

ధోనీ, సచిన్ వంటి ప్రముఖులు తమ విధుల ద్వారా యువతను సైన్యంలో చేరడానికి ప్రేరణ ఇచ్చారు. అయితే, వారికి ఆర్మీ హోదాలు ఇవ్వడం మాత్రమే, యుద్ధంలో పాల్గొనడం కాదు. వారి యుద్ధంలో పాల్గొనాలనే నిర్ణయం తీసుకుంటే, అవసరమైన ట్రైనింగ్ ఇచ్చి, వారిని సైన్యంలో తీసుకుంటారు.

టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావం

భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారి 1949 అక్టోబర్ 9న టెరిటోరియల్ ఆర్మీని ప్రారంభించారు. ప్రతి సంవత్సరంలో అక్టోబర్ 9న “టెరిటోరియల్ ఆర్మీ డే”గా ఈ ఆర్మీ వారోత్సవాలు జరుపుకుంటుంది. మొదటి వారోత్సవం 1952 నవంబర్ 8 నుంచి నవంబర్ 15 వరకు జరిపారు.

టెరిటోరియల్ ఆర్మీ విభాగాలు

టెరిటోరియల్ ఆర్మీలో రెండు యూనిట్లు ఉన్నాయి. మొదటి పౌర సంబంధమైనది, రెండోది ప్రాంతీయమైనది. గ్రామీణ ప్రాంతాలు చెందిన వారు ప్రాంతీయ యూనిట్లలో చేరి, 2-3 నెలలు శిక్షణ పొందుతారు. నగర ప్రాంతాలలోని వారు పౌర విభాగంలో చేరి, ఆదివారాలు, సెలవు దినాల్లో 4 రోజుల పాటు శిక్షణ పొందుతారు. టెరిటోరియల్ ఆర్మీ ఎన్నికల విధుల్లో సహాయం కూడా చేస్తుంది.

టెరిటోరియల్ ఆర్మీ నియామకాలకు ప్రకటన

భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ ప్రక్రియ మే 12 నుంచి ప్రారంభమవుతుంది, అంగీకరించిన అభ్యర్థులు జూన్ 10లో దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష జూలై 20న నిర్వహించబడుతుంది. 19 పోస్టుల్లో 18 పురుషులకు మరియు ఒక పోస్టు మహిళలకు కేటాయించారు.

అర్హతలు

టెరిటోరియల్ ఆర్మీలో చేరే అభ్యర్థి వయస్సు 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ విభాగం అనేది ఒక స్వచ్ఛంద సేవా విభాగం. అభ్యర్థి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఎంపిక కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష జరుగుతాయి. అభ్యర్థులు టెరిటోరియల్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ jointerritorialarmy.gov.in ద్వారా దరఖాస్తు చేయాలి.

వివరాలు

దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసిన తరువాత, అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.