Zepto App : ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న రెండో యాప్‌ ఏదో తెలుసా?

ప్రముఖ క్విక్ కామర్స్ స్టార్టప్ జెప్టో అరుదైన ఘనతను సాధించింది. గత సంవత్సరం సెన్సార్ టవర్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన ఫుడ్ అండ్ డ్రింక్స్ యాప్‌ల విభాగంలో జెప్టో రెండవ స్థానంలో నిలిచింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అంతర్జాతీయంగా అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ అత్యధిక డౌన్‌లోడ్‌లతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశానికి చెందిన మరో క్విక్ కామర్స్ కంపెనీ బ్లింక్‌ఇట్ అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌లలో జెప్టో తర్వాత పదో స్థానంలో నిలిచింది. ఇతర వర్గాలలో భారతదేశం నుండి ఫుడ్ అండ్ కిరాణా విభాగంలో జొమాటో ఐదవ స్థానంలో ఉంది. స్విగ్గీ తొమ్మిదవ స్థానంలో ఉంది. సెన్సార్ టవర్ ప్రకారం.. జెప్టో 2024లో దేశీయంగా డౌన్‌లోడ్‌లలో 300 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ముఖ్యంగా.. కంపెనీ ‘ఇప్పుడే కొనండి-తర్వాత చెల్లించండి’ ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి, ఎక్కువ మంది వినియోగదారులు జెప్టోను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఫీచర్ కారణంగా గత సంవత్సరం చివరి త్రైమాసికంలో సగటు నెలవారీ వినియోగదారుల సంఖ్యలో బ్లింక్‌ఇట్‌ను అధిగమించిందని సెన్సార్ టవర్ నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం భారతదేశంలో ఫుడ్ అండ్ డ్రింక్స్ విభాగంలో మొత్తం 353 మిలియన్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారని, ఇది గత సంవత్సరం కంటే 43 శాతం ఎక్కువ అని కూడా నివేదిక పేర్కొంది.

Related News