తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూకు అసలు కారణం ఇదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆస్ట్రేలియా నుండి వలస పక్షులు కొల్లేరు సరస్సు, ఇతర నీటి వనరులకు పెద్ద సంఖ్యలో వచ్చాయి. పక్షి విసర్జన, ముక్కు నుండి వచ్చే స్రావాలు నీటిలోకి చేరితే బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ పక్షులు నీటి వనరులలోని కోళ్ల ఫామ్‌లకు తిరిగి వచ్చినప్పుడు వైరస్ వ్యాపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే, బర్డ్ ఫ్లూకు టీకా లేదు. కోళ్ల ఫామ్‌ల వద్ద పరిశుభ్రతను కాపాడుకోవాలి. వైరస్ వ్యాప్తిని నియంత్రించాలి.
BIRD FLU: బర్డ్ ఫ్లూ రావడానికి అసలు కారణమిదేనా?

16
Feb