కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుంచి యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ప్రవేశపెట్టింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన భద్రతతో కూడిన పెన్షన్ అందించే కొత్త మార్గం. NPS vs UPS మధ్య పెద్ద తేడా ఏమిటంటే, UPSలో చివరి తీసుకున్న జీతం ఆధారంగా నిర్ధిష్టమైన పెన్షన్ అందుతుంది.
UPS అంటే ఏమిటి?
UPS అనేది నిధుల ఆధారిత పెన్షన్ వ్యవస్థ. ఇందులో ఉద్యోగి, ప్రభుత్వం ఇద్దరూ నియమితంగా విరాళాలను ఇస్తూ, ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెల నెలా పెన్షన్ అందేలా చూడటమే దీని లక్ష్యం.
NPS కి UPS కి తేడా ఏమిటి?
- NPS మార్కెట్ ఆధారంగా పని చేస్తుంది. పెన్షన్ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ పై ఆధారపడి ఉంటుంది.
- UPS లో మార్కెట్ అనిశ్చితి ఉండదు. చివరి జీతం ఆధారంగా ఖచ్చితమైన పెన్షన్ వస్తుంది.
- NPS లో పెట్టుబడులపై వచ్చిన లాభాలను బట్టి పెన్షన్ మారుతుంది.
- UPS లో కనీసం ₹10,000 పెన్షన్ (కనీసం 10 సంవత్సరాలు ఉద్యోగం చేసినవారికి) ఖచ్చితంగా వస్తుంది.
- ఒకసారి UPS ఎంచుకుంటే తిరిగి NPS కి మారలేరు.
Tax బెనిఫిట్స్ & ప్రభుత్వ సహాయం
- NPS & UPS రెండింటిలోనూ ఉద్యోగి విరాళం 10% వరకు, ప్రభుత్వం 14% వరకు Income Tax మినహాయింపు పొందుతుంది.
- UPS లో అదనంగా ప్రభుత్వం 8.5% అదనపు సహాయం అందిస్తుంది.
UPS ద్వారా ఎంత పెన్షన్ వస్తుంది?
- ఉద్యోగి చివరి 12 నెలల సగటు జీతం లో 50% వరకు పెన్షన్ వస్తుంది.
- కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తయినవారికి పూర్తి పెన్షన్ లభిస్తుంది.
- 10 సంవత్సరాలపైన ఉద్యోగం చేసినవారికి కనీసం ₹10,000 నెలవారీ పెన్షన్ అందుతుంది.
- స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్న వారు ఉద్యోగంలో కొనసాగినట్లయితే వచ్చే పెన్షన్ పొందుతారు.
కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేస్తుంది?
- ఉద్యోగి విరాళం – 10% (బేసిక్ + DA)
- కేంద్ర ప్రభుత్వ విరాళం – 10% (బేసిక్ + DA)
- అదనంగా ప్రభుత్వం 8.5% విరాళం UPS కింద అందిస్తుంది.
లంప్-సమ్ (Lump Sum) పేమెంట్ ఎలా ఉంటుంది?
- ఉద్యోగి ప్రతి 6 నెలలకు 10% బేసిక్ + DA లంప్-సమ్ తీసుకునే అవకాశం ఉంటుంది.
- ఇది పెన్షన్ మొత్తంపై ప్రభావం చూపదు.
ఇక రిటైర్మెంట్ తర్వాత భద్రతపై టెన్షన్ అవసరం లేదు. UPS చాలా మందికి భరోసాగా మారనుంది. మీ భవిష్యత్తును సురక్షితంగా ప్లాన్ చేసుకోవాలంటే ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకోండి.