Akkineni Nagarjuna: నాగార్జున అసలు పేరు అది కాదా? అయన అసలు పేరేంటి?

తెలుగు చిత్ర సీమలో యువసామ్రాట్ గా పేరుగాంచిన, టాప్ హీరోలలో ఒకరైన అక్కినేని నాగార్జున మన్మధుడు సినిమా తర్వాత మన్మధుడు నాగార్జున అయ్యాడు. ఆ తర్వాత ఆయన కింగ్ నాగార్జున అయ్యాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సినిమా ఒక్కటే ఆయన రంగం కాదు. ఆయన అనేక రకాల వ్యాపారాలు చేస్తారు. రియల్ ఎస్టేట్, రెస్టారెంట్లు, నిర్మాణాలు, సమావేశాలు చేస్తారు.. అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఆయన పేరు తెచ్చుకున్నారు. శివ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను ఆయన రెండు భాగాలూ గా శివ సినిమాకి ముందు , తర్వాత అనే చరిత్ర క్రియేట్ చేశారు. ఆయన ట్రెండ్ సెట్టర్ సినిమాను, పరిశ్రమకు అలాంటి దర్శకుడి (రాంగోపాల్వర్మ) ని అందించారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ఆయన చాలా ముందుంటారు .

ఆయన సినీ పరిశ్రమకు మూల స్థంభం గా నిలిచారు

1990లలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో కలిసి తిరుగులేని హీరోగా నిలిచారు. ఈ నలుగురు ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలుగా నిలిచారు. ప్రస్తుతం ఈ నలుగురు హీరోలలో బాలయ్య వరుస సూపర్ హిట్లతో అగ్రస్థానంలో ఉండగా, వెంకటేష్, చిరంజీవి రెండవ స్థానంలో ఉన్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంలో విఫలమైన ఏకైక వ్యక్తి నాగార్జున. ప్రస్తుతం ధనుష్ కుబేరుడు, రజనీకాంత్ కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన తొలిసారి కూలీలో విలన్ గా నటిస్తున్నారు. వీటిని పూర్తి చేసిన తర్వాత ఆయన 100వ సినిమా చేస్తారని భావిస్తున్నారు. దీని కోసం చాలా కథలు వినిపిస్తున్నాయి.

ఆలస్యంగా తెలుసుకున్నందుకు ఆశ్చర్యపోతున్నారు

సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు అందరూ ఆయనను నాగార్జున అని పిలిచారు. అయితే, చాలా మందికి నాగార్జున అసలు పేరు తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు తన చిన్న కొడుకు నాగార్జునకు నాగార్జున సాగర్ అని పేరు పెట్టారు. నాగార్జున పుట్టిన సమయంలోనే అతిపెద్ద మానవ నిర్మిత ఆనకట్ట అయిన నాగార్జున సాగర్ ను నిర్మిస్తున్నందున నాగేశ్వరరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత, నాగార్జున తన పేరు చివర ఉన్న సాగర్ ను తొలగించి నాగార్జునగా ఉంచారు. ఆయన ఇప్పటివరకు అదే పేరుతో కొనసాగుతున్నారు. నాగార్జున అసలు పేరు నాగార్జునసాగర్ అని తెలుసుకుని అభిమానులు, సినీ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి, మోహన్ బాబు, రజనీకాంత్ లాగానే నాగార్జున కూడా తన పేరు మార్చుకున్నారని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారని చెబుతారు.