Shool Fee: 3వ క్లాసుకు రూ.3 లక్షలు కడుతున్నాం.. మేం 9 లక్షలు కడుతున్నాం..

.మన పూర్వీకుల కాలంలో సంపన్నవర్గాలకే పరిమితమైన విద్య ఆ తర్వాత ప్రాథమిక హక్కుగా మారింది. కాలంతో పాటు విద్య నిర్వచనం మారుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

అందరూ చదువుకోవాలనే అవగాహన పెరిగింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే విద్యావ్యవస్థను కార్పొరేట్ శక్తులు చేజిక్కించుకున్నాయో అప్పటి నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. కుల వివక్ష లేకుండా సమానంగా ఇవ్వాల్సిన విద్యలోనే తేడా మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య అనే పరిస్థితి లేకుండా పోయి లక్షలు వెచ్చించి ‘కొనుగోలు’ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
.
కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు లక్షల్లో ఉన్న స్కూల్ ఫీజులను ఏటా 10 శాతం వరకు పెంచుతూ మధ్యతరగతి ప్రజలపై మరింత భారం మోపుతున్నాయి. గురుగ్రామ్‌కు చెందిన ఓ పేరెంట్ చేసిన ట్వీట్ ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. స్కూల్ ఫీజుల పెంపుపై తల్లిదండ్రులు స్పందిస్తూ.. ‘తమ 3వ తరగతి పిల్లల స్కూల్ ఫీజు ప్రతి సంవత్సరం 10 శాతం పెరుగుతోంది. ప్రస్తుతం నెలకు 30,000 రూపాయలు చెల్లిస్తున్నాడు. అయితే, ఆ పిల్లవాడు 12వ తరగతికి వెళ్లే సరికి.. సంవత్సరానికి 9 లక్షలు చెల్లించాలి.

దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలతో విసిగి వేసారిన తల్లిదండ్రులంతా ఆ ట్వీట్ కింద తమ ఆవేదనను వ్యాఖ్యల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇతర కార్పొరేట్ స్కూళ్ల తీరు కూడా ఇలాగే ఉండడంతో అదుపు లేకుండా పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. స్కూల్ ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *