క్రెడిట్ కార్డుతో ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లౌంజ్ యాక్సెస్… ఇప్పుడు ప్రయాణం అద్భుతంగా మారిపోతుంది…

క్రెడిట్ కార్డ్ ఎంచుకునేప్పుడు చాలా మంది ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం చూస్తారు. అదే ఎయిర్‌పోర్ట్ లౌంజ్ యాక్సెస్. ప్రయాణ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో ఆరామంగా కూర్చొని, ఫ్రీ ఫుడ్ & డ్రింక్స్ ఆస్వాదించేందుకు, ఫ్రీ వైఫై ఉపయోగించేందుకు ఈ లౌంజ్ యాక్సెస్ చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ సదుపాయం క్రెడిట్ కార్డ్‌తో ఫ్రీగా వస్తే ఇంకా ఏం కావాలి?

ఎవరికి అత్యంత ఉపయోగకరం?

ఇది ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి చాలా ప్రయోజనకరం. దేశంలో లేదా విదేశాల్లో ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్లకు ఇలాంటి ఫ్రీ లౌంజ్ యాక్సెస్‌ ఉన్న క్రెడిట్ కార్డులు చాలా అవసరం. కొన్ని కార్డులు చిన్న ఫీజు తీసుకుంటాయి లేదా నిర్దిష్ట ఖర్చు చేసిన తర్వాత మాత్రమే లౌంజ్ యాక్సెస్ ఇస్తాయి. మీరు నెలకు, త్రైమాసికం లేదా సంవత్సరానికి పలు మార్లు లౌంజ్ ఎంట్రీ ఇవ్వగలిగే కార్డును వెతుకుతుంటే, కింది క్రెడిట్ కార్డుల వివరాలు మీకు హెల్ప్ అవుతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఫ్రీ లౌంజ్ ఎంట్రీ కలిగిన బెస్ట్ క్రెడిట్ కార్డులు

1. Axis Atlas Credit Card: జాయినింగ్ ఛార్జ్ – ₹5000, ఏటా ఛార్జ్ – ₹5000, వెల్కం బెనిఫిట్ – 2,700 EDGE మైల్స్ (రివార్డ్ పాయింట్స్), లౌంజ్ యాక్సెస్ – ప్రతి సంవత్సరం 18 ఫ్రీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లౌంజ్ ఎంట్రీలు మరియు 2 ఇంటర్నేషనల్ లౌంజ్ ఎంట్రీలు.

2. HDFC Regalia Gold

జాయినింగ్ ఛార్జ్ – ₹2500, ఏటా ఛార్జ్ – ₹2500 (₹4 లక్షల ఖర్చు చేస్తే మాఫీ), వెల్కం బెనిఫిట్ – ₹2500 విలువైన గిఫ్ట్ వౌచర్, లౌంజ్ యాక్సెస్ – 12 ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లౌంజ్ ఎంట్రీలు (దేశీయ & అంతర్జాతీయంగా)

3. SBI Card Elite

జాయినింగ్ ఛార్జ్ – ₹4999, ఏటా ఛార్జ్ – ₹4999, వెల్కం బెనిఫిట్ – ₹5000 విలువైన ఈ-గిఫ్ట్ వౌచర్, లౌంజ్ యాక్సెస్ – ప్రతి త్రైమాసికానికి 2 ఫ్రీ డొమెస్టిక్ లౌంజ్ ఎంట్రీలు మరియు వర్షానికి 6 ఇంటర్నేషనల్ లౌంజ్ ఎంట్రీలు (త్రైమాసికానికి 2 సార్లు మాత్రమే)

4. HDFC Tata Neu Infinity

జాయినింగ్ ఛార్జ్ – లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌గా ఫ్రీ, ఏటా ఛార్జ్ – ₹1,499 (₹3 లక్షల ఖర్చు చేస్తే మాఫీ), వెల్కం బెనిఫిట్ – 1,499 న్యూ కాయిన్స్. లౌంజ్ యాక్సెస్ – 8 ఫ్రీ డొమెస్టిక్ + 4 ఇంటర్నేషనల్ లౌంజ్ ఎంట్రీలు

5. Marriott Bonvoy HDFC

జాయినింగ్ ఛార్జ్ – ₹3000, ఏటా ఛార్జ్ – ₹3000, లౌంజ్ యాక్సెస్ –12 ఫ్రీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లౌంజ్ ఎంట్రీలు మరియు 12 ఫ్రీ ఇంటర్నేషనల్ లౌంజ్ ఎంట్రీలు

6. YES Bank Marquee

జాయినింగ్ ఛార్జ్ – ₹9999, ఏటా ఛార్జ్ – ₹4999 (₹10 లక్షల ఖర్చు చేస్తే మాఫీ), లౌంజ్ యాక్సెస్ – అంతర్జాతీయంగా ఎన్ని సార్లైనా లౌంజ్ యాక్సెస్ పొందే అవకాశం,  ప్రతి త్రైమాసికానికి 6 డొమెస్టిక్ లౌంజ్ ఎంట్రీలు మరియు ప్రతి త్రైమాసికానికి గెస్ట్‌లకు 2 ఫ్రీ లౌంజ్ ఎంట్రీలు.

మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తారా? అయితే మీ కోసం బెస్ట్ క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకొని ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లౌంజ్ ప్రయోజనాలను ఉపయోగించుకోండి. ఎప్పుడూ ఎయిర్‌పోర్ట్‌లో హడావుడి లేకుండా, అద్భుతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవాలంటే, ఈ కార్డులు మీకు చక్కటి ఎంపిక. మరి ఆలస్యం ఎందుకు? మీ కోసం బెస్ట్ క్రెడిట్ కార్డ్‌ను ఇప్పుడే సెలెక్ట్ చేసుకోండి.