లక్ష రూపాయల బడ్జెట్ లో కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా… మార్కెట్లోని టాప్ 5 బైక్స్ ఇవే!

బైక్… కొందరికి ఎమోషన్ అయితే మరికొందరికి తప్పనిసరి. అత్యవసరమైన పనికైనా, ఆఫీసుకైనా, స్కూల్‌కైనా, ఈ రోజుల్లో బైక్‌ తప్పనిసరి అయిపోయింది. మీరు ఎక్కడికైనా వేగంగా వెళ్లాలనుకుంటే, బైక్ ఉత్తమ ఎంపిక. ముఖ్యంగా ట్రాఫిక్‌లో సిగ్నల్స్ దాటేందుకు బైక్‌నే ఉత్తమం. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో బైక్ ధరలు కాస్త పెరిగాయనే చెప్పాలి. అత్యాధునిక ఫీచర్లతో కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. లక్ష రూపాయల లోపు మంచి ఫీచర్లతో స్టైల్ మరియు కంఫర్ట్ మేళవించిన బైక్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఆ బైక్‌లపై ఓ లుక్కేయండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  1. హోండా షైన్ హోండా నుండి వచ్చిన అన్ని బైక్‌లలో ఈ బైక్ ప్రత్యేకమైనది. 125 సీసీ ఉన్న ఈ బైక్ అప్పట్లో సంచలనం. ఈ బైక్ లీటరుకు 55 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ డ్రమ్ బ్రేక్‌లు మరియు డిస్క్ బ్రేక్‌లతో రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. 125 cc BS-6 ఇంజన్‌తో వస్తున్న ఈ బైక్ 5 రకాల రంగుల్లో లభిస్తుంది.

2. బజాజ్ పల్సర్ 125 లక్షల లోపు మంచి బైక్ బజాజ్ పల్సర్ అని అందరూ అంటున్నారు. కొత్త మోడల్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మొబైల్ నోటిఫికేషన్‌లను కూడా స్క్రీన్‌పై చూడవచ్చు. ఇది 125 cc BS-6 DTS-i ఇంజన్‌తో లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ 4 రంగులలో అందుబాటు ధరలో మార్కెట్లో లభ్యమవుతోంది.

3. 125 సీసీ బైక్‌లలో హీరో గ్లామర్‌ను ఎక్కువగా ఇష్టపడతారని చెప్పవచ్చు. 4-స్ట్రోక్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తున్న ఈ బైక్ లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇంధన సామర్థ్యంలో ఇదే అత్యుత్తమం. ఇది డిస్క్ మరియు డ్రమ్ బ్రేక్‌లు అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ బైక్ ఏ ప్రదేశం, నగరం, గ్రామం, కఠినమైన రహదారికి బాగా సరిపోతుంది.

4. Hero Splendor Plus ఈ స్ప్లెండర్ ప్లస్ బైక్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్… దీనికి ప్రధాన కారణం దీని మైలేజీ. ఇది లీటరుకు 80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో ఐ3ఎస్ టెక్నాలజీ వల్ల పెట్రోల్ కూడా చాలా ఆదా అవుతుంది. సీటు కూడా పొడవుగా ఉంటుంది కాబట్టి సౌకర్యం కూడా ఎక్కువే. అంతే కాకుండా ఇందులో సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఉంది. 100 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో వస్తున్న ఈ బైక్ నడపడం కూడా చాలా సులువు.

5. TVS రైడర్ ఈ బైక్ TVS నుండి అత్యంత సరసమైన బైక్‌లలో ఒకటిగా చెప్పబడింది. ఇది 125 సిసి ఇంజిన్‌తో లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ 6 వేరియంట్‌లతో పాటు 8 రంగులలో లభిస్తుంది. ఈ బైక్‌లో ఎకో మరియు స్పోర్ట్ రైడింగ్ మోడ్‌ల వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి.