భారత మార్కెట్లో ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు మారుతి సుజుకి గత కొన్ని నెలలుగా అనేక వాహనాల ధరలను పెంచింది. వీటిలో హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ప్రసిద్ధి చెందిన మారుతి వ్యాగన్ ఆర్ ధరలు కూడా పెరిగాయి. ఇది ఫిబ్రవరి 2025 నెలలో జరిగింది. ఈ కొత్త ధరలను ఇప్పటికే కస్టమర్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ ధరను రూ. 15,000 వరకు పెంచింది. మారుతి కంపెనీలోని కొన్ని వేరియంట్‌ల ధరలు రూ. 10,000 వరకు పెరిగాయి.
ఏ వేరియంట్‌ల ధరలు పెరిగాయి..
ప్రసిద్ధ మారుతి వేరియంట్‌లైన VXI 1.0 AGS, ZXI 1.2 AGS, ZXI+ 1.2 AGS, ZXI+ AGS డ్యూయల్ టోన్ వేరియంట్‌ల ధరలు రూ. 15,000 వరకు పెరిగాయి. మిగతా అన్ని వేరియంట్‌ల ధరల పెరుగుదల రూ. 10,000 వరకు పెరిగింది. మారుతి వ్యాగన్ ఆర్ తాజా ధరల విషయానికొస్తే..
బేస్ వేరియంట్ (LXI): ₹5.64 లక్షలు (ఎక్స్-షోరూమ్)
VXI: ₹6.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZXI: ₹6.38 లక్షలు (ఎక్స్-షోరూమ్)
LXI CNG: ₹6.54 లక్షలు (ఎక్స్-షోరూమ్)
VXI AGS: ₹6.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZXI+: ₹6.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZXI AGS: ₹6.88 లక్షలు (ఎక్స్-షోరూమ్)
VXI CNG: ₹6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZXI+ AGS: ₹7.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)
పోటీ ఎవరు..?
హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అందుబాటులో ఉన్న ప్రధాన వాహనాలతో మారుతి వ్యాగన్ ఆర్ పోటీ పడనుంది. ఈ విభాగంలో మారుతి సెలెరియో, ఎస్ ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్, హ్యుందాయ్ గ్రాండ్ నియోస్ i10 వంటి హ్యాచ్‌బ్యాక్ కార్లు పోటీ పడుతున్నాయి. అలాగే వ్యాగన్ ఆర్ టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ వంటి SUV లతో పోటీ పడనుంది. అయితే ఈ ధరల పెరుగుదల ప్రధానంగా మార్కెట్లో రాబోయే వ్యూహాలు, కొత్త వాహనాల తయారీ ఖర్చు పెరుగుదల కారణంగా ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2025లో వాహనదారుల ఆర్థిక పరిస్థితి, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఈ ధరల పెరుగుదల చాలా మంది మారుతి కస్టమర్లను ప్రభావితం చేస్తుంది.