
భూమి భ్రమణానికి సంబంధించిన అద్భుతమైన వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లడఖ్‌లో భూమి భ్రమణానికి సంబంధించిన టైమ్-లాప్స్ వీడియోను భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ తీశారు. హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజనీర్-ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న ఆంగ్‌చుక్ 24 గంటల పాటు టైమ్-లాప్స్ ఉపయోగించి ఈ వీడియోను చిత్రీకరించారు.
హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజనీర్-ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న ఆంగ్‌చుక్ 24 గంటల పాటు టైమ్-లాప్స్ ఉపయోగించి ఈ వీడియోను చిత్రీకరించారు. మొత్తం విషయాన్ని ఒక నిమిషం వీడియోగా సంకలనం చేశారు. అందులో, భూమి ఎలా తిరుగుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. నక్షత్రాలు స్థిరంగా ఉంటే, భూమి తిరుగుతూ ఉంటుందని.. మరియు దీన్ని వీడియోలో బంధించడం చాలా కష్టమని ఆంగ్‌చుక్ అన్నారు.
భూమి భ్రమణాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా ఉపయోగపడే వీడియోను తయారు చేయాలనే అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన తెలిపారు. లడఖ్‌లో అత్యంత చలి పరిస్థితుల కారణంగా, వీడియో చిత్రీకరణ జరిగిన నాలుగు రాత్రులలో బ్యాటరీ పనిచేయకపోవడం, టైమర్ పనిచేయకపోవడం వంటి అనేక అడ్డంకులను ఎదుర్కొన్నానని ఆయన అన్నారు. కానీ ఎలాగైనా వీడియోను రూపొందించాలనే ఆలోచనతో ముందుకు సాగానని ఆయన అన్నారు.
[news_related_post]