అమెరికా స్టాక్ మార్కెట్ రెండో రోజు కూడా భారీ నష్టాల్లోకి వెళ్లింది. ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌ల ప్రభావంతో మార్కెట్ కుదేలైంది. చైనా సహా అనేక దేశాలు దీనిపై ప్రతిస్పందిస్తూ కొత్త పన్నులు విధించాయి. దాంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ అవరేజ్ ప్రారంభ ట్రేడింగ్‌లోనే 1,250 పాయింట్లు పతనమైంది. ఇది అమెరికా స్టాక్ మార్కెట్‌లో ప్రధాన బ్లూ చిప్ సూచికల్లో ఒకటి. ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే మార్కెట్ భారీగా పడిపోయింది.
ముఖ్యంగా ఎనర్జీ, ఫైనాన్షియల్, మెటీరియల్స్, టెక్నాలజీ రంగాల్లో మూడో రోజు కూడా భారీ అమ్మకాలు జరిగాయి. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్ 5 సంవత్సరాలలోనే అత్యంత భారీ నష్టాలను చవి చూసింది. పెట్టుబడిదారులు గ్లోబల్ ట్రేడ్ వార్ భయంతో షేర్లను అమ్ముకోవడం వల్ల మార్కెట్ మరింత దిగజారింది.
Related News
డౌ జోన్స్ సూచిక ప్రారంభ ట్రేడింగ్‌లో 3.1% నష్టంతో 39,287.2 వద్దకు పడిపోయింది. బోయింగ్, గోల్డ్మాన్ సాక్స్, జేపీ మోర్గాన్, నివిడియా, కాటర్‌పిల్లర్, ఇంటెల్, అప్లోవిన్, మైక్రాన్, టెస్లా, గ్రెయిల్ కంపెనీల స్టాక్‌లు 5% నుండి 15% వరకు నష్టపోయాయి.
చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం అవుతుందనే భయంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. చైనా ప్రభుత్వం అమెరికా దిగుమతులపై 34% అదనపు పన్ను విధించింది. దీని ప్రభావంతో మార్కెట్ మరింత కుదేలవుతుందనే అనుమానాలు బలంగా ఉన్నాయి.
అమెరికా స్టాక్ మార్కెట్‌లో ప్రధాన సూచికలు తీవ్ర నష్టాల్లోకి వెళ్లాయి. న్యూయార్క్ సమయం ప్రకారం ఉదయం 9:55 (భారత కాలమానం 7:25 సాయంత్రం) వరకు సూచికల పరిస్థితి ఇలా ఉంది.
డౌ జోన్స్ 1,101 పాయింట్లు (2.7%) నష్టపోయి 39,444 వద్ద ట్రేడైంది. S&P 500 166 పాయింట్లు (3.1%) పతనమై 5,230 వద్ద ట్రేడయింది. నాస్‌డాక్ 547 పాయింట్లు (3.3%) నష్టపోయి 16,002 వద్ద కొనసాగింది. రస్సెల్ 2000 84 పాయింట్లు (4.4%) పడిపోయి 1,826 వద్దకు చేరుకుంది.
గత కొన్ని వారాలుగా ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన వాణిజ్య చర్యలు, అమెరికా ప్రధాన ట్రేడ్ భాగస్వాముల ప్రతిస్పందనలు పెట్టుబడిదారుల మూడ్‌ను దెబ్బతీశాయి. దీంతో 2020 కోవిడ్ పతనం తర్వాత ఇంతటి భారీ నష్టాలను స్టాక్ మార్కెట్ చూడడం ఇదే తొలిసారి.
ముందు మార్కెట్ స్థిరపడేలా కనిపించినా, ట్రేడ్ వార్ భయాలతో పెట్టుబడిదారులు మరింత సెల్లింగ్ కు ఒడిగట్టే అవకాశముంది. మరి ఈ పతనం ఇంకా కొనసాగుతుందా? లేక త్వరలోనే మార్కెట్ తిరిగి కోలుకుంటుందా?